Samsung Galaxy S24 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్..!

Samsung Galaxy S24 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధర తగ్గింపును అందిస్తుంది.

Samsung Galaxy S24 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ ధర తగ్గిందోచ్..!

Samsung Galaxy S24 Ultra price

Updated On : January 14, 2025 / 7:10 PM IST

Samsung Galaxy S24 Ultra : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? వచ్చేవారం శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరుగనుంది. కొత్త జనరేషన్ గెలాక్సీ ఎస్ సిరీస్ మోడల్‌లు కొద్ది రోజుల్లోనే లాంచ్ కానున్నాయి.

శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ మోడల్‌ లాంచ్‌కు ముందే పాత జనరేషన్ ఎస్ సిరీస్ మోడల్‌ల ధరలు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో భారీ ధర తగ్గింపును అందిస్తున్నాయి.

Read Also : iPhone 16E Launch : కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? చౌకైన ధరకే ఐఫోన్ 16E వచ్చేస్తోంది.. ఫీచర్లు, డిజైన్ వివరాలివే!

ప్రస్తుతం, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ భారీ తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను సరసమైన ధరకు పొందవచ్చు. ఈ ధర గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్‌ కొత్త జనరేషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై డిస్కౌంట్లను అందిస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ధర తగ్గుదల :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీకి రూ.134999 ధరకే ఉంది. అయితే, అమెజాన్‌‌లో కేవలం రూ.107990 వద్ద అందుబాటులో ఉంది. కొనుగోలుదారులకు ఫ్లాగ్‌షిప్ మోడల్‌పై 20శాతం తగ్గింపును అందిస్తుంది. ఆన్‌లైన్ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ ధర తగ్గుదల ఉండవచ్చు.

ఇ-కామర్స్ తగ్గింపులతో పాటు, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ ధరను మరింత తగ్గాలంటే కొనుగోలుదారులు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు.

అమెజాన్ లిస్టింగ్ ప్రకారం.. కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కనీస కొనుగోలు విలువ రూ.5వేల వద్ద రూ.వెయ్యి వరకు 10శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కొనుగోలుదారులు స్మార్ట్‌ఫోన్‌పై రూ.22800 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే, మారకపు రేటు స్మార్ట్‌ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్స్‌పై ఆధారపడి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ ఎందుకు కొనాలంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్ టైటానియం ఫ్రేమ్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు వంటి కొన్ని అప్‌డేట్స్ అందిస్తుంది. ఈ రెండు చేర్పులు రాబోయే గెలాక్సీ ఎస్25 అల్ట్రా మోడల్‌తో కూడా ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 చిప్‌సెట్‌తో 12జీబీ ర్యామ్ పవర్‌‌ఫుల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరా, 3ఎక్స్, 5ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను అందించే రెండు టెలిఫోటో లెన్స్‌లతో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. అదనంగా, 5000mAh బ్యాటరీతో 24 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. అందువల్ల, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది.

Read Also : Flipkart Republic Day Sale : ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 16 సిరీస్‌పై రూ.12వేల వరకు డిస్కౌంట్..!