Samsung Galaxy S25 Price
Samsung Galaxy S25 Price : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S25 ధర భారీగా తగ్గింది. మీరు క్లీన్ యూఐ, ఇన్‌స్టా-రెడీ కెమెరాలు, ఫ్లాగ్‌షిప్ పర్ఫార్మెన్స్ ఆధారిత ఫోన్ కోసం చూస్తుంటే ఇదే సరైన సమయం.
ఐఫోన్ 16 మాదిరి ఫోన్ కోసం చూస్తుంటే.. శాంసంగ్ గెలాక్సీ S25 బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. శాంసంగ్ ఇండియా స్టోర్‌లో ఆఫర్ ద్వారా కేవలం రూ. 61వేల లోపు ధరకే అందుబాటులో ఉంది.
అంతేకాదు.. స్టోర్ బ్యాంక్ డిస్కౌంట్, ఇతర బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏడాది ప్రారంభంలో గెలాక్సీ S25 ప్లస్, శాంసంగ్ S25 అల్ట్రాతో లాంచ్ అయింది. శాంసంగ్ గెలాక్సీ S25పై బెస్ట్ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శాంసంగ్ గెలాక్సీ S25 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ S25 ఇప్పుడు రూ.74,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. రూ.61వేలు లోపు కొనుగోలు చేయవచ్చు. ఈఎంఐ లేని కొనుగోళ్లకు శాంసంగ్ స్టోర్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.10వేలు బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.
అదనంగా, మీరు మొదటిసారి కొనుగోలు చేస్తే శాంసంగ్ షాప్ యాప్‌పై కొనుగోలుదారులు రూ.4వేలు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
స్టోర్ శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసే వారు తమ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూతో పాటు రూ. 11వేలు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు.
కస్టమర్లు రూ. 1,499కు శాంసంగ్ (Assured Buyback) యాడ్-ఆన్ (12 నెలలకు) పొందవచ్చు. 70శాతం వరకు రీసేల్ వాల్యూను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S25 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S25 ఫోన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో 6.2-అంగుళాల FHD+ అమోల్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది.
12GB ర్యామ్, 512GB వరకు స్టోరేజీని కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా సపోర్టుతో 4000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7 స్కిన్‌పై రన్ అవుతుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో OISతో కూడిన 50MP బ్యాక్ కెమెరా, 12MP అల్ట్రావైడ్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. వాటర్, రెసెస్టిన్స్ కోసం IP68-రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.