Ray Ban Smart Glasses : వారెవ్వా.. రే బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ చూశారా..? ఫీచర్లు మాత్రం అదుర్స్.. ధర ఎంతో తెలుసా?
Ray Ban Smart Glasses : రే మెటా స్మార్ట్ గ్లాసెస్ భారత్‌కు వచ్చేశాయి.. అద్భుతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ గ్లాసెస్ ధర, లభ్యత వివరాలను లుక్కేయండి.

Ray Ban Smart Glasses
Ray Ban Smart Glasses : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రే బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి అరంగేట్రం చేశాయి.
కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రొడక్టుల విస్తరణకు సంబంధించి ప్లాన్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత మెటా ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రవేశపెట్టింది. రే బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ క్లాసిక్ ఐవేర్ డిజైన్‌ను అడ్వాన్స్ స్మార్ట్ టెక్నాలజీతో అందిస్తోంది.
రే బాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్ మెటా ఏఐ ద్వారా యాక్సస్ చేయొచ్చ. వినియోగదారులు ‘Hey Meta’ అనే వాయిస్ కమాండ్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వొచ్చు. ఈ హ్యాండ్స్-ఫ్రీ అసిస్టెంట్ రియల్-టైమ్ డేటాను అందించడమే కాదు.. కాల్స్ మేనేజ్ చేయడం, స్ట్రీమింగ్ మ్యూజిక్, కిచినె టిప్స్ కూడా అందిస్తుంది.
వినియోగదారుల ప్రశ్నలకు కూడా సమాధానమివ్వగలదు. ఇందులో అత్యంత ముఖ్యమైన ఫీచర్ రియల్-టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ కూడా ఉంది. ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్ భాషలకు సపోర్టు ఇస్తుంది.
వినియోగదారులు ముందుగా లాంగ్వేజీ ప్యాక్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నంత వరకు ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు కూడా ఈ భాషలలో కమ్యూనికేట్ చేయవచ్చు. ట్రాన్సులేషన్లు, అద్దాల ద్వారా వినియోగదారుకు డెలివరీ చేయొచ్చు.
అవతలి వ్యక్తి కనెక్ట్ చేసిన ఫోన్‌లో ట్రాన్స్‌క్రిప్ట్‌ను కూడా వీక్షించవచ్చు. మెటా ఏఐ యాప్‌తో ఈ స్మార్ట్ గ్లాసెస్ కన్వర్జేషన్ హిస్టరీ, ఫొటో ఎడిటింగ్ వంటి అదనపు ఫీచర్లను అందిస్తాయి. ఈ గ్లాసెస్ వినియోగదారులు యాప్‌లోనే నేరుగా ఫొటోలను క్యాప్చర్, ఎడిట్ చేయొచ్చు.
మెటా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌లలో హ్యాండ్స్-ఫ్రీ మెసేజింగ్, కాల్స్ అలాగే స్పాటిఫై, ఆపిల్ మ్యూజిక్, అమెజాన్ మ్యూజిక్, షాజమ్‌లలో మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం ఆకర్షణీయమైన అప్‌డేట్స్ రిలీజ్ చేస్తుంది.
భారత్‌లో మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్ ధర, లభ్యత :
భారతీయ మార్కెట్లో మెటా రే బాన్ స్మార్ట్ గ్లాసెస్ ధర రూ.29,900. వినియోగదారులు ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ముందస్తుగా (Ray-Ban.com)లో ఆర్డర్ చేసుకోవచ్చు. మే 19 నుంచి స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.
Read Also : Apple iPhone 16e : బిగ్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఐఫోన్ 16.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!
కస్టమర్లు ప్రామాణిక పెద్ద సైజులలో క్లాసిక్ వేఫేరర్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. స్కైలర్ మోడల్‌తో పాటు ఫిట్‌ను కూడా అందిస్తుంది. లెన్స్ ఎంపిక విషయానికి వస్తే.. కస్టమర్లు తమ అవసరాలను బట్టి సన్, క్లియర్, పోలరైజ్డ్, ట్రాన్సిషన్స్ లేదా ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను ఎంచుకోవచ్చు.