Samsung Galaxy Z Fold 6 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై స్టన్నింగ్ డిస్కౌంట్.. తక్కువ ధరకే ఇలా కొనేసుకోండి

Samsung Galaxy Z Fold 6 : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

1/6Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : అమెజాన్‌లో సేల్స్ సందడి కొనసాగుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ వంటి వివిధ బ్రాండ్ల ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు కూడా కొత్త శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అందులోనూ ఫోల్డబుల్ ఫోన్ చూసేవారు అయితే ఈ ఆఫర్ అసలు వదులుకోవద్దు. శాంసంగ్ ఫోల్డబల్ ఫోన్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. శాంసంగ్ మడతబెట్టే స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లకు సంబంధించి డిస్కౌంట్ వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
2/6Samsung Galaxy Z Fold 6
అమెజాన్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర తగ్గింపు : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్, 12GB ర్యామ్ వేరియంట్‌ అసలు లాంచ్ ధర రూ. 1,64,999 నుంచి అమెజాన్ రూ. 1,03,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.
3/6Samsung Galaxy Z Fold 6
అన్ని అమెజాన్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా రూ. 3,119 అమెజాన్ పే బ్యాలెన్స్ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. తద్వారా తగ్గింపు ధరకే కొనుగోలు చేయొచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ తగ్గింపు ధరతో సిల్వర్ షాడో, నేవీ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
4/6Samsung Galaxy Z Fold 6
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. గేమింగ్, వీడియో కోసం అడ్రినో 750 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ కూడా కలిగి ఉంది.
5/6Samsung Galaxy Z Fold 6
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7.6-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X ఇన్నర్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల డైనమిక్ LTPO అమోల్డ్ 2X కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.
6/6Samsung Galaxy Z Fold 6
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 4MP అండర్ డిస్‌ప్లే సెన్సార్, 10MP కవర్ సెన్సార్ కనిపిస్తాయి. 4400mAh బ్యాటరీతో పాటు 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.