Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ లవర్స్ మీకోసమే.. తక్కువ ధరకే శాంసంగ్ మడతబెట్టే ఫోన్.. డోంట్ మిస్!
Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే ఎలా పొందాలంటే?

Samsung Galaxy Z Fold 6
Samsung Galaxy Z Fold 6 : శాంసంగ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఫ్లాగ్‌షిప్ ఫోల్డబుల్, గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర భారీగా తగ్గింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 సందర్భంగా ఈ శాంసంగ్ ఫోన్ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. బ్యాంక్ ప్రమోషన్‌లతో రూ.41,950కి లిస్టు అయింది.
ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభంలో దాదాపు రూ.1,64,999 ధరకు లాంచ్ అయింది. డ్యూయల్ అమోల్డ్ ప్యానెల్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, గెలాక్సీ ఏఐ ఫీచర్లు, డిజైన్ వంటి ఆకట్టుకునేలా ఉన్నాయి.
అమెజాన్ నుంచి గెలాక్సీ Z ఫోల్డ్ 6పై రూ.41వేలు ఆదా చేయొచ్చు. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర రూ.1,24,299కి అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు లేవు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్ ఉంటే.. మీరు రూ.1,250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. మొత్తం రూ.41,900 కన్నా ఎక్కువ లేదా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి రూ.3,728 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్లు EMI ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. నెలకు రూ.6,026 నుంచి ఈఎంఐ ప్రారంభమవుతుంది. నో-కాస్ట్ EMI కలిగి ఉంటుంది.
వర్కింగ్ కండిషన్, బ్రాండ్, వేరియంట్ ఆధారంగా వినియోగదారులు తమ పాత ఫోన్ రూ. 72,300 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. తద్వారా ధరను మరింత తగ్గించుకోవచ్చు. కొనుగోలుదారులు ఎక్కువ చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ లేదా మొత్తం ప్రొటెక్షన్ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెసిఫికేషన్లు :
లేటెస్ట్ బుక్-స్టైల్ ఫోల్డబుల్ 6.3-అంగుళాల బిగ్ కవర్ స్క్రీన్, 7.6-అంగుళాల మెయిన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండు ప్యానెల్స్ అమోల్డ్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తాయి.
స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజీ వేరియంట్‌తో వస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్‌తో 4400mAh డ్యూయల్ బ్యాటరీని కలిగి ఉంది.
సర్కిల్ టు సెర్చ్, ఏఐ అసిస్ట్, ఇంటర్‌ప్రెటర్ అనేక ఏఐ ఫీచర్లను కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ OISతో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ లెన్స్, 10MP టెలిఫోటో షూటర్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ ఈ ఫోన్ 10MP, 4MP ఫ్రంట్ కెమెరాలతో వస్తుంది.