Microsofts palm-sized God chip
Satya Nadella : ప్రస్తుత డిజిటల్ ప్రపంచ యుగంలో కొత్త సాంకేతికతలు నిరంతరం ఉద్భవిస్తున్నాయి. ముఖ్యంగా, కంప్యూటింగ్ రంగంలో కొత్త సాంకేతికత రాకతో అన్ని సమస్యలు సులభంగా పరిష్కరమవుతున్నాయి. ఈ విషయంలో, ప్రపంచంలోని ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటం చిప్ ‘మజోరానా’ (మైక్రోసాఫ్ట్ మజోరానా1)ను ఆవిష్కరించింది.
మనకు తెలిసిన కంప్యూటింగ్‌ను మార్చగల కొత్త క్వాంటం ప్రాసెసింగ్ యూనిట్ (QPU) అనమాట. టోపోలాజికల్ కోర్ ఆర్కిటెక్చర్ ద్వారా ఆధారితమైన ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటం చిప్ ఇది. ఈ క్వాంటం కంప్యూటర్ పారిశ్రామిక స్థాయి సమస్యలను పరిష్కరించగలదని కంపెనీ ఆశిస్తోంది. 20 సంవత్సరాల అన్వేషణ తర్వాత మైక్రోసాఫ్ట్ చివరకు “పూర్తిగా కొత్త చిప్ సృష్టించింది” అని మైక్రోసాఫ్ట్ సీఈఓ భారతీయ సంతతికి చెందిన సత్య నాదెళ్ల అన్నారు.
మైక్రోసాఫ్ట్ పరిశోధన, ఈ ఆవిష్కరణ కంప్యూటింగ్ రంగంలో పెద్ద ముందడుగు వేయగలదని నాదెళ్ల ఆశాభావం వ్యక్తం చేశారు. టోపోలాజికల్ కోర్‌పై నిర్మించిన ఈ చిప్.. దాదాపు రెండు దశాబ్దాల పరిశోధన తర్వాత అభివృద్ధి అయింది.
టోపోకండక్టర్ల ద్వారా తయారైన ఈ క్వాంటమ్ చిప్ ఆవిర్భావాన్ని సీఈఓ సత్య నాదెళ్ల కంప్యూటింగ్‌లో ప్రాథమిక ముందడుగుగా అభివర్ణించారు. మనలో చాలా మంది ఘన, ద్రవ, వాయువు అనే మూడు ప్రధాన రకాల పదార్థాలు ముఖ్యమైనవి అని నేర్చుకుంటూ పెరిగారు” అని పేర్కొంటూ సీఈఓ సత్య నాదెళ్ల ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
‘‘నేడు అది మారిపోయింది. టోపోకండక్టర్ల ద్వారా ఆవిష్కరణ సాధ్యమైంది. ప్రస్తుత నమూనాల కన్నా వేగవంతమైనవి ఎంతో నమ్మదగినవి చిన్న క్వాంటం కంప్యూటర్లకు దారితీసే కొత్త తరగతి పదార్థాలను టోపోకండక్టర్లు కనుగొన్నారు’’ ఆయన వివరించారు. నాదెళ్ల పోస్టుకు బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ స్పందిస్తూ.. క్వాంటం కంప్యూటింగ్‌తో మరిన్ని పురోగతులు…” అంటూ రీట్వీట్ చేశారు.
More and more breakthroughs with quantum computing … https://t.co/rF4Hl9EQm0
— Elon Musk (@elonmusk) February 19, 2025
అయితే, ఈ పరిమితులను అధిగమించడానికి మైక్రోసాఫ్ట్ కొత్త మార్గాన్ని కనుగొన్నట్లు చెబుతోంది. ఇలాంటి ప్రాసెసర్ ప్రపంచంలోని ప్రస్తుత కంప్యూటర్లన్నింటినీ మించిపోతుంది. ఈ స్థాయి శక్తి మెటీరియల్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రగ్ డిస్కవరీ వంటి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు.
క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి :
క్వాంటం కంప్యూటింగ్‌లో సమాచారానికి ప్రాథమిక యూనిట్లు అయిన క్యూబిట్‌లు, ఒక మిల్లీమీటర్‌లో 1/100 వంతు ఉంటాయి. దీని అర్థం.. మైక్రోసాఫ్ట్ ఇప్పుడు ఒక మిలియన్-క్విట్ ప్రాసెసర్‌కు మార్గం సుగమం చేసింది. సత్య నాదెళ్ల ప్రకారం.. “మీ అరచేతిలో సరిపోయే చిప్‌ను ఊహించుకోండి. నేడు భూమిపై ఉన్న అన్ని కంప్యూటర్లు కలిపి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించగలవు.” అని పేర్కొన్నారు.
కొత్త చిప్ క్వాంటం కంప్యూటర్లు పరివర్తనాత్మక, వాస్తవ ప్రపంచ పరిష్కారాలను అందించడానికి వీలు కల్పిస్తుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. టోపోకండక్టర్లు లేదా టోపోలాజికల్ సూపర్ కండక్టర్లు అనేవి స్పెషల్ కేటగిరీగా చెప్పవచ్చు.
వేగవంతమైన, చిన్న, డిజిటల్‌గా నియంత్రించగల మరింత స్టేబుల్ క్విట్‌లను తయారు చేసేందుకు ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ పరిశోధకులు టోపోలాజికల్ క్విట్‌ల ప్రత్యేకమైన క్వాంటం ఫీచర్లను ఎలా సృష్టించగలిగారో ఒక డాక్యుమెంట్‌లో వివరించారు.
క్వాంటం ఆధిపత్యం కోసం పోటీ :
క్వాంటం ఆధిపత్యాన్ని సాధించడంలో మైక్రోసాఫ్ట్ ఒక్కటే కాదు.. గత డిసెంబర్‌లో గూగుల్ సొంత క్వాంటం చిప్ విల్లోను ప్రవేశపెట్టింది. ఐదు నిమిషాల్లోపు బెంచ్‌మార్క్ గణనను నిర్వహించగలదని పేర్కొంది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ రూపుదాల్చేందుకు బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. “క్వాంటం కంప్యూటింగ్ చాలా ఉపయోగకరంగా మారేందుకు ఇంకా 20 సంవత్సరాలు పడుతుందని ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ పేర్కొన్నారు.