SBI FD Rates
SBI FD Rates : ఎస్బీఐ ఫిక్స్ డిపాజిట్లరకు షాకింగ్ న్యూస్.. ఇకపై మీ FD అకౌంట్లపై తక్కువ వడ్డీ అందనుంది. ఎందుకంటే.. ఎస్బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించింది.
దేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోన్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గించింది. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 0.50 శాతం తగ్గించగా అన్ని బ్యాంకులు ఇప్పుడు రుణాలు, FDలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి.
ఎస్బీఐ కూడా వడ్డీ రేట్లను 0.5 శాతం తగ్గించింది. ఎస్బీఐ రెపో ఆధారిత వడ్డీ రేటు (RLLR) 0.5 శాతం తగ్గించగా ఇప్పుడు 7.75 శాతానికి చేరింది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత వడ్డీ రేటు (EBLR) కూడా 0.5 శాతం తగ్గించి ఇప్పుడు 8.65 నుంచి 8.15 శాతానికి చేరుకుంది.
ఎస్బీఐ వెబ్‌సైట్‌లో వడ్డీ రేటు ప్రకారం.. సవరించిన వడ్డీ రేట్లు జూన్ 15, 2025 నుంచి అమల్లోకి వచ్చాయి. రెపో-ఆధారిత వడ్డీ రుణాలు చౌకగా మారనున్నాయి. కానీ, సేవింగ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్ అకౌంట్లపై పొందే వడ్డీ ఆదాయం భారీగా తగ్గనుంది.
Read Also : SBI Interest Rates : ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. భారీగా తగ్గిన వడ్డీ రేట్లు.. ఇక రుణాలన్నీ చౌకగా..!
ఎస్బీఐ బ్యాంక్ FD కొత్త వడ్డీ రేట్లు ఇవే :