SBI Best Bank 2024 : ఎస్బీఐకి అరుదైన ఘనత.. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్’గా అవార్డు!
SBI Best Bank in India 2024 : ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డుల వేడుకలో గ్లోబల్ ఫైనాన్స్ ఎస్బీఐ బ్యాంక్‌ను 2024 ఏడాదికి భారత అత్యుత్తుమ బ్యాంకుగా గుర్తించింది.

SBI honoured
SBI Best Bank in India 2024 : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి అరుదైన ఘనత దక్కింది. దేశంలోనే అత్యుత్తమ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచింది. ఈ మేరకు అమెరికాస్ గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024 బ్యాంకు ఆఫ్ ఇండియాగా ఎస్బీఐని ప్రకటించింది. వాషింగ్టన్‌లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశం సందర్భంగా జరిగిన 31వ వార్షిక బెస్ట్ బ్యాంక్ అవార్డుల వేడుకలో గ్లోబల్ ఫైనాన్స్ ఎస్బీఐ బ్యాంక్‌ను 2024 ఏడాదికి భారత అత్యుత్తుమ బ్యాంకుగా గుర్తించింది.
ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ సెట్టీ ఈ అవార్డును అందుకున్నారని బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అసాధారణమైన సేవలను అందించడంతో పాటు తన కస్టమర్ల నమ్మకాన్ని సంపాదించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రోత్సహాలను అందించినందుకు ఎస్బీఐ బ్యాంక్ ఈ అవార్డును అందుకుంది.
గ్లోబల్ ఫైనాన్స్ బెస్ట్ బ్యాంక్ అవార్డ్‌లను విశ్వసనీయత, సమగ్రతకు గౌరవంగా అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి బ్యాంకులను గుర్తించి వాటికి ఈ అవార్డులను ప్రదానం చేస్తుంటుంది. 22,500 పైగా బ్రాంచులు, 62వేల ఏటీఎంలతో విస్తృత నెట్‌వర్క్‌ను కలిగిన ఎస్బీఐ యోనో (YONO) డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా భారతీయ బ్యాంకింగ్ రంగంలో వృద్ధిని బలోపేతం చేస్తోంది.
క్యూ1 ఆర్థిక సంవత్సరం (FY25)లో 63శాతం కొత్త సేవింగ్స్ అకౌంట్లు ఖాతాలు డిజిటల్‌గా మారాయి. యోనో ద్వారా మొత్తం రూ. 1,399 కోట్ల వ్యక్తిగత రుణాల చెల్లింపులు జరిగాయి. 2013-14, 2022-23 ఆర్థిక సంవత్సరాల మధ్య వార్షిక ఆదాయం రూ. 5 లక్షల వరకు ఉన్న వ్యక్తుల ఆదాయ అసమానత 74.2 శాతం తగ్గింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Read Also : Apple iPhone 16 ban : ఇండోనేషియాలో నిజంగానే ఆపిల్ ఐఫోన్ 16 నిషేధించారా? ఈ ఊహాగానాల వెనక వాస్తవాలేంటి?