Apple iPhone 16 ban : ఇండోనేషియాలో నిజంగానే ఆపిల్ ఐఫోన్ 16 నిషేధించారా? ఈ ఊహాగానాల వెనుక వాస్తవాలేంటి?

Apple iPhone 16 ban : ఇండోనేషియాలో నిజంగానే ఆపిల్ ఐఫోన్ 16 నిషేధించారా? ఈ ఊహాగానాల వెనుక వాస్తవాలేంటి?

Apple iPhone 16 banned in Indonesia

Updated On : October 27, 2024 / 6:39 PM IST

Apple iPhone 16 ban : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ కంపెనీకి ఇండోనేషియా ప్రభుత్వం షాకిచ్చింది. ఇండోనేషియాలో ఆపిల్ ఐఫోన్ల విక్రయాన్ని పూర్తిగా నిషేధించింది. అందులో ప్రధానంగా లేటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లపై నిషేధం విధించింది. అలా ఎవరైనా ఈ మోడల్ ఐఫోన్లను వినియోగిస్తే చట్టవిరుద్ధమని కూడా హెచ్చరిస్తోంది.

వాస్తవానికి ఇవన్నీ ఊహాగానాలు మాత్రమేనని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇప్పటివరకూ ఇండోనేషియా ప్రభుత్వం ఈ నిషేధాన్ని ధృవీకరిస్తూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఇండోనేషియాలో ఐఫోన్ 16 లభ్యత అనిశ్చితంగానే ఉంది. ప్రధాన ఇండోనేషియా నివేదికలను పరిశీలిస్తే.. వాస్తవానికి దేశంలో ఐఫోన్ 16 అమ్మకానికి పరిమితి ఉండవచ్చని సూచిస్తున్నాయి. ఆపిల్ పెట్టుబడి హమీలను నిలబెట్టుకోలేనందున ఐఫోన్ 16 విక్రయాలపై నిషేధం విధించినట్టు తెలుస్తోంది.

నిశితంగా పరిశీలిస్తే.. టోకోపీడియా, బ్లిబ్లి, లజాడాతో సహా ఇండోనేషియాలోని అనేక టాప్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఐఫోన్ 16 ఫోన్ విక్రయాలను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లలో యాక్సెసరీలు అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త ఐఫోన్ మాత్రం అందుబాటులో లేదు. ఇండోనేషియాలోని ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ కూడా ఐఫోన్ 16 లేదా లేటెస్ట్ లైనప్‌లోని ఇతర మోడల్‌లను విక్రయించడం లేదు. దీనిపై ఇండోనేషియా అధికారిక ప్రభుత్వ అధికారిక ప్రకటన లేనప్పటికీ పరిమితంగానే ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇండోనేషియాలో నిర్దిష్ట పెట్టుబడుల హామీలను నెరవేర్చడంలో ఆపిల్ విఫలం చెందడమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతానికి, ఆపిల్ హామీ ఇచ్చిన 1.71 ట్రిలియన్ రూపాయలలో 1.48 ట్రిలియన్ రూపాయిలను పెట్టుబడి పెట్టింది. దాంతో 230 బిలియన్ ఇండో రూపాయల కొరత ఏర్పడింది. దాంతో టీకేడీఎన్ (డొమెస్టిక్ కాంపోనెంట్ లెవెల్) సర్టిఫికేషన్ జారీపై ప్రభావం పడుతుంది. ఇండోనేషియాలో విక్రయించే విదేశీ డివైజ్‌లపై 40 శాతం స్థానికంగా తయారీ ఉండటం తప్పనిసరి.

“ఐఫోన్ 16 విక్రయాలపై ఇంకా అనుమతులు జారీ చేయలేదు. ఎందుకంటే ఆపిల్ హామీలను ఇంకా నెరవేర్చలేదు” అని ఇండోనేషియా పరిశ్రమల మంత్రి అగస్ గుమివాంగ్ కర్తాసస్మిత పేర్కొన్నారు. అదనంగా, “ఇండోనేషియాలో ఐఫోన్ 16 వాడితే అది చట్టవిరుద్ధమని అన్నారు. అలా ఎవరైనా ఐఫోన్ 16 వాడుతుంటే వెంటనే మాకు రిపోర్టు చేయండి” అని కర్తాసస్మిత యూజర్లకు హెచ్చరిక జారీ చేసినట్లు కంపాస్ సైట్ నివేదించింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటీవల జకార్తాలో పర్యటించిన తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. ఐఫోన్ తయారీకి సంబంధించి చర్చించేందుకు అధ్యక్షుడు జోకో విడోడోతో సమావేశమయ్యారు.

అయినప్పటికీ, ఆపిల్ ఆర్‌అండ్‌డీ కోసం లోకల్ ఆపిల్ అకాడమీలతో సహా ఇండోనేషియాలో పెట్టుబడుల హామీలను నెరవేర్చే వరకు ఆ దేశ మార్కెట్‌లో ఐఫోన్ 16 భవిష్యత్తు అస్పష్టంగానే ఉంటుంది. ఆపిల్ టీకేడీఎన్ సర్టిఫికేషన్ రివ్యూలో ఉంది. ఇండోనేషియా కస్టమర్‌లు టెక్ దిగ్గజం తదుపరి కార్యాచరణలను బట్టి లేటెస్ట్ ఐఫోన్ లైనప్‌ను పొందేందుకు మరింతకాలం వేచి ఉండాల్సిందే.

Read Also : iPhone 16 vs iPhone 17 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 కొంటే బెటరా? ఐఫోన్ 17 కోసం వేచి ఉండాలా?