SBI vs BoB vs PNB
SBI vs BoB vs PNB : ఫిక్స్‌డ్ డిపాజిట్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఎక్కడ ఎఫ్‌డీ చేస్తే మంచి రాబడి ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? అయితే, సీనియర్ సిటిజన్ల కోసం ఆకర్షణీయమైన ఎఫ్‌డీ అందించే బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వంటి PSU బ్యాంకులు వివిధ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకాలను అందిస్తున్నాయి.
Read Also : PM Kisan 19th Installment : మరో 3 రోజుల్లో పీఎం కిసాన్ డబ్బులు.. మీ అకౌంట్‌లో రూ. 2వేలు పడకపోతే ఏం చేయాలంటే?
ఇందులో ఎస్బీఐ అమృత్ వృష్టి, బీఓబీ ఉత్సవ్ వంటి ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. ఈ ఎఫ్‌డీలో మీరు వడ్డీని పొందేందుకు ఎంచుకున్న కాలానికి ఏకమొత్తం పెట్టుబడి పెట్టవచ్చు. రాబడిని పొందాలంటే ఎఫ్‌డీలను పెట్టుబడికి సురక్షితమైన మార్గంగా పరిగణిస్తారు.
సేవింగ్స్ అకౌంట్ల కన్నా ఎక్కువ వడ్డీని కూడా ఇస్తాయి. ఎఫ్‌డీలలో నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక ప్రాతిపదికన వడ్డీని పొందడాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ మూడు PSU బ్యాంకుల్లో SBI, PNB, BoB ఉన్నాయి. ఏయే బ్యాంకులో మీరు 5 సంవత్సరాల పాటు రూ. 1 లక్ష, రూ. 2 లక్షల పెట్టుబడిపై అధిక రాబడిని పొందవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
SBI : 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేటు ఎంతంటే? :
5 సంవత్సరాల ఎఫ్‌డీపై ఎస్బీఐ 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 1 శాతం అధిక వడ్డీ రేటు లభిస్తుంది. అంటే.. ఐదు సంవత్సరాలలో 7.50 శాతం వడ్డీ రేటు పొందవచ్చు.
SBI : రూ. 1 లక్ష, రూ. 2 లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీ ఎంత? :
రూ. లక్ష పెట్టుబడిపై, మీరు మెచ్యూరిటీపై రూ. 1,38,042 పొందుతారు. సీనియర్ సిటిజన్లు మెచ్యూరిటీపై రూ. 1,44,995 పొందుతారు. మరోవైపు, మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 2,76,084, సీనియర్ సిటిజన్లు రూ. 2,89,990 పొందుతారు.
BoB 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) రేటు ఎంతంటే? :
బ్యాంక్ ఆఫ్ బరోడా 5 సంవత్సరాల (FD)పై 6.80 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాలలో 7.40 శాతం వడ్డీ రేటును పొందుతారు.
BoB : రూ. 1 లక్ష, రూ. 2 లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీ ఎంత? :
రూ. లక్ష పెట్టుబడిపై, మీరు మెచ్యూరిటీ మొత్తం రూ. 1,40,094 పొందుతారు. సీనియర్ సిటిజన్లు మెచ్యూరిటీపై రూ. 1,44,285 పొందుతారు. మీరు రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీ మెచ్యూరిటీ మొత్తం రూ. 2,80,188, సీనియర్ సిటిజన్లు రూ. 2,88,570 పొందుతారు.
పీఎన్‌బీ (PNB) 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ రేటు ఎంత? :
బ్యాంక్ ఆఫ్ బరోడా 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 5 సంవత్సరాలలో 7.00 శాతం వడ్డీ రేటును పొందుతారు.
PNB : రూ. 1 లక్ష, రూ. 2 లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీ ఎంతంటే? :
రూ.1 లక్ష పెట్టుబడిపై మీరు మెచ్యూరిటీ రూ.1,38,042 పొందుతారు. అదే సీనియర్ సిటిజన్లు మెచ్యూరిటీపై రూ.1,41,478 పొందుతారు. మీరు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే.. మీ మెచ్యూరిటీ మొత్తం రూ.2,76,084, సీనియర్ సిటిజన్లు రూ.2,82,956 పొందుతారు.