సెన్సెక్స్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్

  • Published By: veegamteam ,Published On : February 27, 2019 / 05:24 AM IST
సెన్సెక్స్ : లాభాల్లో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్

Updated On : February 27, 2019 / 5:24 AM IST

భారతీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం(ఫిబ్రవరి 27,2019)న  లాభాలతో దూసుకెళ్తోంది. సెన్సెక్స్ 368 పాయింట్ల లాభంతో 36,138 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 10,918 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలహాబాద్‌ బ్యాంక్‌, ధనలక్ష్మీ బ్యాంక్‌లను RBI.. PCA నుంచి తొలగించిన విషయం తెలిసిందే. దీంతో ఈ షేర్లు జోరుగా ట్రేడవుతున్నాయి.
యస్‌బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్, మారుతి, అల్ట్రా టెక్‌, HPCL, ICICI బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా. సన్ ఫార్మా, యస్ బ్యాంక్ షేర్లు 3 శాతం పెరిగాయి. 

అదేసమయంలో విప్రో, భారతీ ఇన్‌ఫ్రాటెల్, HCL, BPCL, HUL, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. విప్రో 2 శాతం పడిపోయింది.