SIP Investments : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా జస్ట్ రూ.1000 ఆదా చేయండి.. 20 ఏళ్లలో రూ.10 లక్షలపైనే సంపాదించుకోవచ్చు!

SIP Investments : మహిళలు పొదుపు చేయడం చేస్తుంటారు. అలా పొదుపు చేసిన డబ్బులను పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం 20 ఏళ్లలో రూ. 10 లక్షలపైనే సంపాదించి లక్షాధికారి అవ్వొచ్చు.

SIP Investments

SIP Investments : మహిళలకు గుడ్ న్యూస్.. డబ్బు సంపాదించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, చాలామంది మహిళలు ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, పొదుపు విషయానికి వస్తే.. వారు ఎవరూ సాటిరారనే చెప్పాలి. ఒకవైపు ఇంటిని చూసుకుంటూనే ఉన్న మొత్తంలో డబ్బును ఆదా చేయడం చేస్తుంటారు.

సాధారణంగా, మహిళలు తమ పొదుపు మొత్తాన్ని ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి లేదా వారి సరదాల కోసం ఖర్చు చేస్తారు. కానీ, మీరు ప్రతి నెలా రూ. 1000 ఆదా చేసి పెట్టుబడి పెడితే.. కేవలం 20ఏళ్లలో రూ. 10లక్షల పైనే డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చునే చిన్న చిన్న పొదుపులు చేయడం ద్వారా మీకోసం ఇంత పెద్ద మొత్తాన్ని సేవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : iQOO vs Poco vs Nothing : ఈ మూడు ఫోన్లు కిర్రాక్.. పోటాపోటీ ఫీచర్లు.. ఏది కొంటే బెటర్..? రూ.25వేల లోపు ధరలో బెస్ట్ ఫోన్ ఏంటో తెలుసా?

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే చాలు :
ప్రస్తుత రోజుల్లో మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి పరంగా అద్భుతమైన రాబడి ఆప్షన్లుగా మారాయి. స్టాక్‌ మార్కెట్లో నేరుగా పెట్టుబడి పెట్టడం కన్నా తక్కువ రిస్క్‌తో ఎస్ఐపీ వంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, మీరు కేవలం రూ. 500తో SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి ప్రారంభించవచ్చు.

మీరు కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. మీరు ప్రిన్సిపల్‌ అమౌంట్‌తో పాటు వడ్డీపై కూడా వడ్డీని పొందవచ్చు. ఇలాంటి పరిస్థితిలో మీరు SIP ఎంత ఎక్కువ కాలం నడిపస్తారో అంత లాభాన్ని పొందవచ్చు. సాధారణంగా, 12 శాతం వడ్డీని పొందవచ్చు.

కొన్నిసార్లు 15 శాతం నుంచి 20 శాతం కూడా అందిస్తుంది. ఇందులో మంచి లాభాలు పొందాలంటే మీరు దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలి. మీరు 15 ఏళ్ల నుంచి 20 ఏళ్లు పెట్టుబడి పెడితే.. మీరు కొద్ది మొత్తంలో పెట్టుబడి ద్వారా భారీ లాభాలను ఆర్జించి లక్షాధికారి కావచ్చు.

వెయ్యి నుంచి రూ. 10 లక్షలు సంపాదన ఎలా? :
మీరు SIP ద్వారా మ్యూచువల్ ఫండ్లలో ప్రతి నెలా రూ. 1000 పెట్టుబడి పెట్టాలి.. మీరు సంవత్సరానికి రూ. 12వేలు పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడిని 20 ఏళ్లు అలానే కొనసాగిస్తే.. మీరు మొత్తం రూ. 2 లక్షల 40వేలు పెట్టుబడి పెడతారు. కానీ, 12 శాతం వడ్డీ రేటుతో వడ్డీగా రూ. 6,79,857 మాత్రమే లభిస్తుంది.

Read Also : Bajaj Electric : ఓలా, ఏథర్ ఇక కాస్కోండి.. బజాజ్ మరో సంచలనం.. పెట్రోల్ బండ్లు దండగ.. తక్కువ ధరలో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందిగా..!

ఈ విధంగా, 20 ఏళ్ల తర్వాత మీకు మొత్తం రూ. 9,19,857 అంటే.. దాదాపు రూ. 10 లక్షలు చేతికి వస్తాయి. మీరు 14 శాతం లాభపడితే.. మెచ్యూరిటీ మొత్తం రూ. 11,73,474 అవుతుంది. 15 శాతంగా రాబడిని పొందితే.. మెచ్యూరిటీ సమయంలో మీకు రూ. 13,27,073 వస్తుంది. అంటే.. SIP ద్వారా నెలకు రూ. 1,000 పెట్టుబడితో మీరు కేవలం 20 ఏళ్లలో కనీసం రూ. 10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ డబ్బులను సంపాదించుకోవచ్చు.