Property Registration
Property Registration : మీ ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. అతి త్వరలో (Property Registration) మీ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు. దేశవ్యాప్తంగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ విధానం అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది.
117ఏళ్ల నాటి ఆస్తి చట్టంలో మార్పు :
ఇందుకోసం కేంద్రం ఒక కొత్త ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లు 117 ఏళ్ల (1908) నాటి రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చనుంది. ఈ కొత్త ఆస్తుల రిజిస్ట్రేషన్ చట్టం ద్వారా ఇకపై ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా ఈజీగా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
రాబోయే ఈ కొత్త చట్టం ద్వారా ప్రాపర్టీ ఈ-సర్టిఫికేట్లను పొందొచ్చు. అలాగే, పవర్ ఆఫ్ అటార్నీ, సేల్ సర్టిఫికేట్, ఈక్విటబుల్ మార్ట్‌గేజ్ వంటి డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయడం తప్పనిసరి కానుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్ చట్టాల్లో మార్పులు చేస్తుండగా, కేంద్రం సైతం కొత్త ముసాయిదా చట్టం అమలుపై కసరత్తు చేస్తోంది.
30 రోజుల్లో ప్రజాభిప్రాయ సేకరణ :
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చాలని అనేక రాష్ట్రాలు నిర్ణయించాయి. రిజిస్ట్రేషన్ చట్టం విషయంలో దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించి మార్పులు చేసుకోవచ్చు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూ వనరుల విభాగం ప్రజల అభిప్రాయాల కోసం మే 27న ఈ ముసాయిదాను విడుదల చేసింది. ఆన్ లైన్ ద్వారా 30 రోజుల్లో ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపాల్సిందిగా కేంద్రం కోరింది.
ఆధార్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, డిజిటల్ రికార్డు :
ఈ ముసాయిదా బిల్లు పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కొత్త చట్టంగా దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. కొత్త చట్టం ప్రకారం.. ఈ కొత్త చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రికార్డులను డిజిటల్‌గా మార్చే వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్ల సమర్పించాల్సి ఉంటుంది. అవినీతి, మోసాల నివారణ కోసం ఆధార్ ఆధారిత ధృవీకరణ వ్యవస్థను తీసుకురానుంది.
OTP ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ :
ఆధార్ కార్డుకు లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు OTP వస్తుంది. తద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయొచ్చు. దీనికి ఆ వ్యక్తి సమ్మతి అవసరం. ఆధార్ వివరాలను ఇవ్వడం ఇష్టపడని వారికి ఇతర వెరిఫికేషన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వీలుగా ఇతర రికార్డ్-కీపింగ్ ఏజెన్సీలతో ఇంటిగ్రేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది.
మీ ప్రాపర్టీని ఒకసారి రిజిస్టర్ చేశాక డిజిటల్ సర్టిఫికేట్ వస్తుంది. ఈ డిజిటల్ రికార్డులను తారుమారు చేయడం చాలా కష్టం. వెరిఫికేషన్ చేయడం చాలా సులభం, మీరు ఎప్పుడైనా స్థిర ఆస్తిని విక్రయించాలన్నా రుణం తీసుకోవాలన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. పారదర్శకంగా ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది.