SpaceX employees : ఎలన్మస్క్ను విమర్శించిన స్పేస్ఎక్స్ ఉద్యోగులపై వేటు..!
SpaceX Employees : స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రవర్తనను విమర్శించిన ఆ కంపెనీ ఉద్యోగులపై వేటు పడింది.

Spacex Fires Employees Who Said Elon Musk’s Behavior Is Embarrassment For Them
SpaceX Employees : స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రవర్తనను విమర్శించిన ఆ కంపెనీ ఉద్యోగులపై వేటు పడింది. అంతర్గత చాట్ సిస్టమ్లో షేర్ చేసిన బహిరంగ లేఖలో ఎలోన్ మస్క్ ప్రవర్తనను కొంతమంది ఉద్యోగులు విమర్శించారు. ఇప్పుడు ఆ ఉద్యోగులను SpaceX తొలగించినట్లు ఓ నివేదిక వెల్లడించింది. లేటెస్ట్ నివేదిక ప్రకారం.. SpaceX అధ్యక్షుడు మస్క్ తన ప్రవర్తనతో ఉద్యోగులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఒక లేఖను షేర్ చేశారు. అది మస్క్ దృష్టికి వెళ్లడంతో కొంతమంది ఉద్యోగులను తొలగించారు.

Spacex Fires Employees Who Said Elon Musk’s Behavior Is Embarrassment For Them
ఆ లేఖలో SpaceX నో యాసోల్ విధానం గురించి ప్రస్తావించారు. ఎలోన్ ట్విట్టర్ ప్రవర్తనను బహిరంగంగా ఖండించారు. అదే వారిపై వేటు పడటానికి దారితీసిందని నివేదిక తెలిపింది. ఒక కొత్త నివేదిక ప్రకారం.. SpaceX ప్రెసిడెంట్ Gwynne Shotwell లేఖను రూపొందించిన అనేక మంది ఉద్యోగులను తొలగించారు.
SpaceX ఇంకా ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించలేదు. ఇప్పటివరకూ ఎవరెవరు, ఎంతమందిని తొలగించారో కంపెనీ వెల్లడించలేదు. షాట్వెల్ స్పేస్ఎక్స్ లేఖతో ప్రమేయం ఉన్న అనేక మంది ఉద్యోగులను తొలగించిందని నివేదిక తెలిపింది.
Read Also : Elon Musk : ట్విట్టర్ ఉద్యోగులతో మస్క్ మీట్.. 10 నిమిషాలు ఆలస్యంగా.. హోటల్ కిచెన్ నుంచే స్పీచ్..!