×
Ad

Starlink India : గుడ్ న్యూస్.. 2026లో స్టార్‌లింక్ లాంచ్ తేదీ ఇదిగో.. ధర, ఇంటర్నెట్ స్పీడ్, పూర్తి ప్లాన్లు వివరాలివే..!

Starlink India : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసు రాబోతుంది. 2026లో రాబోయే ఈ సర్వీసు లాంచ్ తేదీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ధర, ప్లాన్ల వివరాలపై ఓసారి లుక్కేయండి.

  • Published On : January 2, 2026 / 02:51 PM IST

Starlink India 2026 (Image Credit To Original Source)

  • భారత మార్కెట్లోకి అతి త్వరలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు
  • మే 2026 నాటికి స్టార్‌లింక్ సేవలు ప్రారంభమయ్యే అవకాశం
  • స్టార్ లింక్ ఇంటర్నెట్ ప్లాన్లు, స్పీడ్, ధర ఎంతంటే?

Starlink India : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వచ్చేస్తోంది. 2026లో భారత మార్కెట్లో అతి త్వరలో ప్రారంభం కానుంది. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ దేశంలో స్టార్‌లింక్ సర్వీసుల కోసం స్థలాన్ని కూడా అద్దెకు తీసుకుంది. అలాగే ఉద్యోగులను కూడా రిక్రూట్ చేసుకుంటోంది.

మొత్తానికి అధికారికంగా స్టార్‌లింక్ సర్వీసులు ప్రారంభించేందుకు కంపెనీ రెడీగా ఉంది. ముఖ్యంగా నెట్‌వర్క్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో స్టార్‌లింక్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర, ప్లాన్‌లు, లభ్యతకు సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లో స్టార్‌లింక్ లాంచ్ తేదీ, ప్లాన్ల ధరలివే :
వాస్తవానికి, స్టార్‌లింక్ ప్రారంభానికి దాదాపు అన్ని అప్రూవల్స్ వచ్చేశాయి. SATCOM గేట్‌వే అప్రూవల్స్, స్పెక్ట్రమ్ లైసెన్సింగ్ వంటివి ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఫార్మాలిటీలన్నీ 2026 మొదటి త్రైమాసికం నాటికి పూర్తయితే మే 2026 నాటికి స్టార్‌లింక్ సేవలు ప్రారంభమవుతుందని అంచనా.

ధరల విషయానికొస్తే.. భారత మార్కెట్లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం వన్ టైమ్ పేమెంట్ కింద దాదాపు రూ. 30వేల నుంచి రూ.35వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా, స్పీడ్ బట్టి నెలకు రూ.3,300 నుంచి రూ.8,600 వరకు నెలవారీ ప్లాన్‌లు అందుబాటులో ఉండవచ్చు.

Read Also : Upcoming Hybrid Cars : హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయోచ్.. 2026లో మార్కెట్ షేక్ చేయనున్న టాప్ 5 కార్లు.. మైలేజీ, ధర వివరాలివే!

స్టార్‌లింక్ ఇంటర్నెట్ లభ్యత, స్పీడ్ ఎంతంటే? :
స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టొచ్చు. దేశంలో 20లక్షల కన్నా ఎక్కువ స్టార్‌లింక్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఉండరాదని కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. అంటే.. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటెర్నెట్ పరిమితంగానే లభిస్తుంది అనమాట.

Starlink India 2026 (Image Credit To Original Source)

అదేవిధంగా, పట్టణ ప్రాంతాల కన్నా మారుమూల ప్రాంతాలలో ఈ శాటిలైట్ సర్వీసులు ఎక్కువగా అందుబాటులోకి రానున్నాయి. స్పీడ్ విషయానికి వస్తే.. 25 Mbps నుంచి 225 Mbps మధ్య స్పీడ్ ఉండొచ్చు.

నగర ప్రాంతాల్లో స్టార్‌లింక్ స్పీడ్ అంతగా ఉండదనే చెప్పాలి. కానీ, మారుమూల ప్రాంతాల్లో మాత్రం శాటిలైట్ ఇంటర్నెట్ చాలా స్పీడ్ ఉంటుంది. ప్రత్యేకించి రిమోట్ రూరల్ ప్రాంతాల కోసమే శాటిలైట్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తోంది.

అంతేకాదు.. రాబోయే రోజుల్లో అమెజాన్ వంటి కంపెనీల నుంచి కూడా స్టార్ లింక్ గట్టి పోటీని ఎదుర్కోనుంది. మస్క్ కంపెనీకి పోటీగా దేశంలో సొంత శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించాలని అమెజాన్ యోచిస్తున్నట్టు సమాచారం.