Upcoming Hybrid Cars : హైబ్రిడ్ కార్లు వచ్చేస్తున్నాయోచ్.. 2026లో మార్కెట్ షేక్ చేయనున్న టాప్ 5 కార్లు.. మైలేజీ, ధర వివరాలివే!
Upcoming Hybrid Cars : కొత్త హైబ్రిడ్ కార్ల కోసం చూస్తున్నారా? మీకు మంచి మైలేజీ కావాలాన్నా ఇంధనం ఆదా కావాలన్నా హైబ్రిడ్ కార్లను తీసుకోవడం బెటర్..
Upcoming Hybrid Cars (Image Credit To Original Source)
- 2026 ఏడాదిలో హైబ్రిడ్ కార్లకు ఫుల్ డిమాండ్
- టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్
- అధిక మైలేజీ, పవర్ ట్రైన్ ఫీచర్లు స్పెషల్ అట్రాక్షన్
- టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ 2
Upcoming Hybrid Cars : 2026లో కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. అతి త్వరలో భారతీయ మార్కెట్లోకి కొత్త హైబ్రిడ్ కార్లు రాబోతున్నాయి. ఎలక్ట్రిక్ కార్లతో ఛార్జింగ్ సమస్యలు, అధిక మైలేజీని కోరుకునే వారికోసం హైబ్రిడ్ కార్లు చాలా బెస్ట్.
ఎందుకంటే.. హైబ్రిడ్ కార్లు తక్కువ ఉద్గారాలు, మైలేజీ ఎక్కువగా (Upcoming Hybrid Cars) ఇస్తాయి. అదే ఎలక్ట్రిక్ కార్లను తీసుకుంటే ఛార్జింగ్ పరంగా బ్యాటరీ ఫెయిల్ వంటి ఇష్యూలు ఎక్కువగా ఉంటాయి. లాంగ్ లైఫ్ ఈజీ డ్రైవింగ్ కావాలంటే హైబ్రిడ్ కార్లనే తీసుకోవడం బెటర్.
దేశీయ ఇంధన ధరలు, ఉద్గార నిబంధనలను పరిశీలిస్తే.. హైబ్రిడ్ కార్లు 2026లో ఫుల్ డిమాండ్ ఉంటుందని అంచనా. సింపుల్ గా చెప్పాలంటే.. హైబ్రిడ్ టెక్నాలజీ అనేది పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటారుతో ఎక్కువ పవర్ అందిస్తుంది.
మైలేజీ స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. 2026 నాటికి అనేక బ్రాండ్లు హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తాయని భావిస్తున్నారు. 2026లో రాబోయే టాప్ 5 హైబ్రిడ్ కార్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ :
ఈ SUVలో హైబ్రిడ్ మోడల్ అద్భుతంగా ఉంటుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. స్పీడ్ పికప్ బాగుంటుంది. నగర ట్రాఫిక్‌లో కూడా సూపర్ మైలేజ్ అందిస్తుంది. లాంగ్ లైఫ్ డ్రైవ్ కోసం టయోటా హైబ్రిడ్ కారు పర్ ఫెక్ట్ అని చెప్పొచ్చు.
మైలేజ్ : 24-26 కి.మీ/లీ (అంచనా)
ధర : రూ. 13-19 లక్షలు (అంచనా)
హోండా సిటీ హైబ్రిడ్ 2026 :
హై కెపాసిటీ మోడల్ కొత్త కారు కావాలా? హోండా సిటీ హైబ్రిడ్ అతి త్వరలో రాబోతుంది. లో స్పీడ్ డ్రైవింగ్ సమయంలో ఎలక్ట్రిక్ మోటారు పెట్రోల్ ఇంజిన్ నుంచి ఛార్జ్ తీసుకుంటుంది. తద్వారా భారీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఫ్యూయిల్ సేవ్ చేస్తుంది.

Upcoming Hybrid Cars (Image Credit To Original Source)
మైలేజ్ : 26+ కి.మీ లీ (అంచనా)
ధర రూ. 18-22 లక్షలు (అంచనా)
హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ :
ఈ కొత్త ఏడాదిలో హ్యుందాయ్ క్రెటా హైబ్రిడ్ వేరియంట్‌ను ఆవిష్కరించనుంది. మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ సెటప్‌లో రానుంది. ఈ కార్లలో ఫీచర్లు అత్యంత అద్భుతంగా ఉంటాయి. నగర కొనుగోలుదారులకు బెస్ట్ ఆప్షన్.
అంచనా మైలేజ్: 20-23 కి.మీ/లీ
అంచనా ధర: రూ. 15-20 లక్షలు
టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ 2 :
ఈ కారు ఇన్నోవా హైక్రాస్ ఫ్యామిలీ-హైబ్రిడ్ MPVలో గట్టిపోటీనిస్తోంది. 2026లో హైబ్రిడ్ సిస్టమ్‌తో ఈ వాహనం హైవే సిటీ డ్రైవింగ్ రెండింటిలోనూ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
21-23 కి.మీ మైలేజ్ (అంచనా)
ధర రూ. 20-30 లక్షలు (అంచనా)
