Motorola Edge 50 Pro : సూపర్ ఆఫర్ బ్రో.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Edge 50 Pro : కొత్త మోటోరోలా ఫోన్ కొంటున్నారా? మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై దిమ్మతిరిగే డిస్కౌంట్ అందిస్తోంది. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి.

Motorola Edge 50 Pro : సూపర్ ఆఫర్ బ్రో.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్.. అమెజాన్‌లో జస్ట్ ఎంతంటే?

Motorola Edge 50 Pro (Image Credit To Original Source)

Updated On : January 2, 2026 / 12:39 PM IST
  • మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB) వేరియంట్ రూ.35,999కి లాంచ్
  • అమెజాన్‌లో ప్రస్తుతం రూ.23,985కి లిస్టింగ్, రూ.12,014 ఫ్లాట్ డిస్కౌంట్
  • మీ పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా తగ్గింపు

Motorola Edge 50 Pro : మోటోరోలా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర భారీగా తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఇప్పుడు రూ. 12వేల కన్నా భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే 125W ఛార్జింగ్‌, ఆకర్షణీయమైన కలర్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ చాలా స్పీడ్ ఉంటుంది. మీరు కొనాలని అనుకుంటే మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

అమెజాన్‌లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ధర తగ్గింపు :
భారత మార్కెట్లో మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (12GB + 256GB వేరియంట్) రూ.35,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ మోడల్ రూ.23,985కు లిస్ట్ అయింది. రూ.12,014 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా ఎక్కువ తగ్గింపు పొందాలంటే మీ పాత స్మార్ట్‌ఫోన్‌‌తో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

Motorola Edge 50 Pro

Motorola Edge 50 Pro (Image Credit To Original Source)

Read Also : Kia Seltos 2026 : కియా ఫ్యాన్స్ గెట్ రెడీ.. 2026 కొత్త కియా సెల్టోస్ కారు వచ్చేసింది.. టాటా సియెర్రా కన్నా చాలా చీప్..

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ HDR10+ సపోర్టును అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్, 12GB వరకు ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. 125W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 4,500mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌‌తో వస్తుంది. ఇందులో OISతో 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ 3x ఆప్టికల్ జూమ్, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం స్మార్ట్‌ఫోన్‌లో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.