Starlink India Plans
Starlink India Plans : ఇంటర్నెట్ యూజర్లకు భారీ గుడ్ న్యూస్.. ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్ స్టార్‌లింక్ కంపెనీ భారత మార్కెట్లోకి వచ్చేస్తోంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీసులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఇంటర్నెట్ సర్వీసు మహారాష్ట్ర వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యాన్ని పొందింది.
అంతేకాదు.. దేశంలో ఇంటర్నెట్ కార్యకలాపాలకు సంబంధించి అనేక ఆమోదాలను కూడా ప్రభుత్వం పొందింది. తాజాగా ఇప్పుడు భారతీయ ఇంటర్నెట్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ ధరలను వెల్లడించింది. ఇంకేమీ ఆలస్యం చేయకుండా అంచనా వేగం, కనెక్టివిటీ, ఇతర వివరాలతో పాటు సర్వీసు ప్లాన్‌లు, ధరలను ఓసారి పరిశీలిద్దాం..
స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదం :
భారత మార్కెట్లో స్టార్‌లింక్ తన ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను పొందింది. ఈ సర్వీసు ప్రారంభానికి ముందే బాగా పాపులర్ అయింది. గతంలో, స్టార్‌లింక్ నెలవారీ సభ్యత్వం భారతీయ యూజర్లకు సరసమైన ధరకు అందుబాటులో ఉంటుందని భావించారు. కానీ, అనుకున్నంత తక్కువ కాదని గమనించాలి.
స్టార్‌లింక్ ప్లాన్ల ధర, సబ్‌స్క్రిప్షన్ :
స్టార్‌లింక్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఇప్పుడు దేశీయ వినియోగదారుల కోసం ఈ సర్వీసు ప్లాన్ల ధరలను వెల్లడించింది. భారత మార్కెట్లో నెలకు రూ. 8,600కు అందుబాటులో ఉంటుంది. వన్-టైమ్ హార్డ్‌వేర్ సెటప్ ధర రూ. 34వేలు ఉంటుంది. స్టార్‌లింక్ ఇంటర్నెట్ సర్వీస్ 30 రోజుల ట్రయల్‌తో వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది.
స్టార్‌లింక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈ ఇంటర్నెట్ సర్వీసులు అన్ని వాతావరణ పరిస్థితులలోనూ అంతరాయం లేకుండా పనిచేస్తాయి. కంపెనీ 99.9శాతం అప్‌టైమ్ లేదా అంతరాయం లేని ఇంటర్నెట్ కనెక్షన్‌కు గ్యారెంటీ ఇస్తుంది. ఇంకా, వినియోగదారులు సైన్-ఇన్ చేయడం ద్వారా వెంటనే ఇంటర్నెట్ సర్వీసులను యాక్సస్ చేయొచ్చు. భారత మార్కెట్లో కమర్షియల్ సబ్‌స్ర్కిప్షన్ ధరలు ఇంకా వెల్లడించలేదు.
Note : స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రస్తుతం భారత్‌లోని అనేక ప్రాంతాలలో అందుబాటులో లేదు. డోంట్ వర్రీ.. ఎందుకంటే ఈ సర్వీసు దశలవారీగా క్రమంగా అందుబాటులోకి వస్తుంది. పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలోని అన్ని ప్రాంతాలలో అందుబాటులో ఉంటుంది.
స్టార్‌లింక్ కనెక్టివిటీ, స్పీడ్ :
కనెక్టివిటీకి సంబంధించి స్టార్‌లింక్ హైదరాబాద్, లక్నో, ముంబై, నోయిడా, కోల్‌కతా, చండీగఢ్‌తో సహా వివిధ ప్రదేశాలలో గేట్‌వే ఎర్త్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఇంటర్నెట్ స్టేషన్లు స్పేస్‌ఎక్స్ శాటిలైట్స్, భూమిపై ఉన్న రిసీవర్‌ల మధ్య కనెక్షన్‌లను మేనేజ్ చేసేందుకు రిలే పాయింట్లుగా పనిచేస్తాయి. స్పీడ్ అధికారికంగా వెల్లడించనప్పటికీ, 25Mbps నుంచి 225Mbps మధ్య ఉంటుందని అంచనా.
స్టార్‌లింక్ ఎవరికి బెస్ట్ అంటే? :
స్టార్‌లింక్ సర్వీసు అనేది గ్రామాలు, కొండలు, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారికి ఇంటర్నెట్ అందిస్తుంది. ఇక్కడ టవర్లు లేదా కేబుల్‌లు ఉండవు. ట్రెడిషనల్ మెథడ్స్ పనిచేయవు. వర్క్ ఫ్రమ్ హోం చేసేవారు,చదువుతున్నవారు లేదా ఇంట్లో నుంచి ఆన్‌లైన్ క్లాసులు, వీడియో కాలింగ్ స్ట్రీమింగ్ వంటి సర్వీసులను పొందవచ్చు.
స్టార్‌లింక్ ఈ ఇంటర్నెట్ సర్వీసులన్నింటిని అందిస్తుంది. నెట్‌వర్క్ తక్కువగా లేదా లేని ప్రాంతాల్లోని రైతులు, అటవీ నివాసులు, వ్యవసాయ ప్రాంతాలకు స్టార్‌లింక్ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు.