Top Smartphones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? 2026లో రిలీజ్ అవ్వబోయే టాప్ మొబైల్స్ ఇవే.. ఫీచర్లు అదుర్స్.. మీ ఫేవరెంట్ ఫోన్ ఇదేనా?
Top Smartphones 2026 : 2026 ఏడాదిలో టాప్ బ్రాండ్ల నుంచి అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 నుంచి రెడ్‌మి నోట్ 15 సిరీస్ వరకు అనేక ఫోన్లు ఉండొచ్చు..
Top Smartphones 2026
Top Smartphones 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? 2026లో సరికొత్త స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి. ముఖ్యంగా శాంసంగ్, ఒప్పో, షావోమీ వంటి వంటి కొన్ని ప్రముఖ బ్రాండ్‌ల కొత్త ఫోన్లు జనవరిలో లాంచ్ కానున్నాయి. అందులో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్, రెడ్‌మి నోట్ 15 సిరీస్, ఒప్పో రెనో సిరీస్ వంటి పాపులర్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లను లాంచ్ చేసే అవకాశం ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లు కలిగి ఉంటాయి. భారీ బ్యాటరీ ప్యాక్, అసాధారణమైన కెమెరా సెటప్, సాలిడ్ ప్రాసెసర్ వంటి అన్ని ట్రెండింగ్ ఫీచర్లతో రానున్నాయి. మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తుంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ :
శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్‌లో S26, S26+, S26 అల్ట్రా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి 2026 చివరిలో లాంచ్ అవుతాయని అంచనాలు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ S26 స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల FHD+ OLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5/ఎక్సినోస్ 2600 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజీతో రావచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండవచ్చు. అయితే, ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా కూడా పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ 4300mAh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉంది.
అదే సమయంలో, శాంసంగ్ గెలాక్సీ S26+ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5/ఎక్సినోస్ 2600 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుందని భావిస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల QHD OLED డిస్‌ప్లేను పొందవచ్చు. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ కలిగి ఉంది. అంతేకాకుండా, శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంటుంది.
120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.9-అంగుళాల QHD OLED డిస్‌ప్లేతో రావచ్చు. 6000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్‌ను చేరుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 16GB ర్యామ్ వరకు, 1TB వరకు స్టోరేజీతో వస్తుందని భావిస్తున్నారు. 200MP మెయిన్ కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్ కలిగి ఉండవచ్చు. అయితే, ఫ్రంట్ సైడ్ మీరు అప్‌గ్రేడ్ చేసిన 12MP లేదా 24MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు.
రెడ్‌మి నోట్ 15 సిరీస్ :
రెడ్‌మి నోట్ 15 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో రెడ్‌మి నోట్ 15, రెడ్‌మి నోట్ 15 ప్రో, రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్ ఉన్నాయి. జనవరి 2026లో భారత మార్కెట్లో లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 15 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. 108MP మెయిన్ కెమెరా+8MP అల్ట్రావైడ్ కెమెరాతో రావచ్చు.
అయితే, ఫ్రంట్ సైడ్ 20MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. అదే సమయంలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5520mAh బ్యాటరీ ప్యాక్ అందిస్తుందని భావిస్తున్నారు. రెడ్‌మి నోట్ 15 ప్రో ప్లస్, రెడ్‌మి నోట్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు 200MP ప్రైమరీ కెమెరాతో వస్తాయని భావిస్తున్నారు. ఈ 3 ఫోన్‌లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను పొందవచ్చు.
ఒప్పో రెనో 15 ప్రో :
జనవరి 2026లో ఒప్పో రెనో 15 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్, హై రిఫ్రెష్ రేట్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని భావిస్తున్నారు. బహుశా 6.7 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మెయిన్ హైలైట్ 200MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుందని భావిస్తున్నారు.
