ఎనిమిదేళ్లలో దారుణంగా పడిపోయిన SUV కార్ల ధరలు

ఎనిమిదేళ్లలో దారుణంగా పడిపోయిన SUV కార్ల ధరలు

Updated On : May 14, 2019 / 5:48 AM IST

SUV కార్ల అమ్మకాల్లో ఎనిమిదేళ్లుగా భారీ క్షీణత కనిపిస్తోంది. టూ వీలర్లతో పాటు, మరి కొన్ని కమర్షియల్ వెహికల్స్‌తో పోల్చుకుని చూస్తే SUV అమ్మకందారులకు భయం పుట్టుకొస్తుంది. ప్రస్తుత సమయంలో సాధారణ ఎన్నికలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు కారణంగా వినియోగదారులలో కొత్త వాహనాలు కొనేందుకు ఆసక్తి కనిపించడం లేదు. ఏప్రిల్ 2020నాటికి చెత్త రికార్డును మూట గట్టుకుంటామేమోనని కంపెనీలు ఆవేదన చెందుతున్నాయి. 

ధర తగ్గితే కొంటారని భావించి వాహనాలను తక్కువ రేట్లకే అందుబాటులో తీసుకువస్తున్నా అమ్మకాల్లో ఏ మార్పులు రావడం లేదు. ఈ మేర ఏప్రిల్ నాటికి 17శాతం తగ్గించగా, అక్టోబర్ 2011నుంచి సరాసరి 20శాతం ధర తగ్గించినట్లు అయింది. మారుతీ సుజుకీ, హ్యుండాయ్, మహీంద్రా & మహీంద్రా అండ్ టయోటాలతో పోటీగా మార్కెట్‌లో నిలిచేందుకు ఈ విధానం అనుసరిస్తుంది SUV మేనేజ్‌మెంట్.

మారుతీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ మాట్లాడుతూ.. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కొనసాగించాలనుకుంటున్నాం. ముందుగా 4నుంచి 8శాతం వృద్ధిని ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు.