Tata Curvv EV Sale : కొంటే ఇలాంటి కారు కొనాల్సిందే.. కొత్త టాటా కర్వ్ ఈవీపై కిర్రాక్ డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌పై 585 కి.మీ రేంజ్..!

Tata Curvv EV
Tata Curvv EV : మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనేందుకు చూస్తున్నారా? ఈ ఆగస్టులో అద్భుతమైన డిస్కౌంట్.. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ SUV, టాటా కర్వ్ ఈవీపై భారీ డిస్కౌంట్ (Tata Curvv EV) అందిస్తోంది.
ఈ ఆఫర్ సందర్భంగా టాటా యూజర్లు రూ.1,40,000 వరకు సేవింగ్ పొందవచ్చు. ఈ ఆఫర్ కింద క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ రెండింటినీ అందిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం వినియోగదారులు తమ దగ్గరలోని డీలర్ సందర్శించవచ్చు.
మోడ్రాన్, ఫీచర్ క్యాబిన్ :
టాటా కర్వ్ ఈవీ కారు లోపలి భాగంలో డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్వాన్స్ కంట్రోలింగ్ కోసం 12.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ స్క్రీన్‌తో వస్తుంది. SUVలో 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.
సెక్యూరిటీ ఫీచర్లు :
టాటా కర్వ్ ఈవీ అనేక సెక్యూరిటీ ఫీచర్లతో వస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో వస్తుంది. ఈ SUVలో 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మెరుగైన డ్రైవర్ అసిస్టెన్స్ కోసం లెవల్-2 అడాస్ కూడా ఉన్నాయి. ఈ ఫీచర్లన్నీ ఫ్యామిలీలు, రోడ్డు ప్రయాణాలకు సేఫ్ జర్నీని అందిస్తాయి.
లాంగ్ డ్రైవింగ్ రేంజ్ ఆప్షన్లు :
టాటా కర్వ్ ఈవీ కారు 2 బ్యాటరీ ప్యాక్ సైజులతో వస్తుంది. 45kWh బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌పై 502 కి.మీ వరకు రేంజ్ కలిగి ఉంటుంది. 55kWh హై ఓల్టేజీ బ్యాటరీ ఆప్షన్ ఫుల్ నింపకుండానే 585 కి.మీ వరకు దూసుకెళ్లగలదు. కారు రైడర్లు ఈ రెండు ఆప్షన్లలో ఏదైనా ఒక రేంజ్ ఎంచుకోవచ్చు.
ధర, కలర్ ఆప్షన్లు :
టాటా కర్వ్ ఈవీ కారు 5 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. భారత మార్కెట్లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షల నుంచి ప్రారంభం కాగా, ఫ్లాగ్‌షిప్ మోడల్ రూ. 22.24 లక్షల నుంచి లభ్యమవుతుంది. ప్రస్తుతం ఈ టాటా కర్వ్ ఎలక్ట్రిక్ SUV తగ్గింపు ధరతో లభ్యం కానుంది.