Samsung Galaxy Z Fold 6 5G : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఈ మడతబెట్టే ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Fold 6 5G : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఫోన్ ధర తగ్గింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ అదిరిపోయే డీల్ అసలు మిస్ చేయొద్దు.

Samsung Galaxy Z Fold 6 5G : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఈ మడతబెట్టే ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?

Samsung Galaxy Z Fold 6 5G

Updated On : August 10, 2025 / 5:37 PM IST

Samsung Galaxy Z Fold 6 5G : కొత్త శాంసంగ్ ఫోల్డబుల్  ఫోన్ కోసం చూస్తున్నారా?  భారత మార్కెట్లో ఇటీవలే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 లాంచ్ చేసింది. అయితే, ఈ మడతబెట్టే ఫోన్ (Samsung Galaxy Z Fold 6 5G) లాంచ్ అయిన వెంటనే పాత మోడల్ శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధర భారీగా తగ్గింది. ఈ ఫోన్ ధర రూ.52వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. భారత మార్కెట్లో ఈ మడతబెట్టే ఫోన్ దాదాపు రూ.1,65,000 ధరతో లాంచ్ అయింది.

ట్రిపుల్ కెమెరా సెటప్, పవర్‌ఫుల్ అమోల్డ్ ప్యానెల్, బుక్-స్టైల్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ కలిగి ఉంది. మీరు కొత్త ఫోల్డబుల్ కోసం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్‌లో గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G తగ్గింపు ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ధర :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఫోన్ అసలు ధర రూ.1,16,250 నుంచి రూ.48వేల ధర తగ్గింపు పొందింది. మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో అదనంగా రూ.4వేలు తగ్గింపు పొందవచ్చు. ఫలితంగా ధర రూ.1,12,250 ధరకే సొంతం చేసుకోవచ్చు.

Read Also : Samsung Galaxy S26 Ultra : 6G నెట్‌వర్క్ స్పీడ్‌తో శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వస్తోంది.. లాంచ్ తేదీ, ధర, కెమెరా ఫీచర్లు లీక్..!

మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయాలంటే వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి అద్భుతమైన వాల్యూను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. అదనంగా, ఎక్స్‌‌టెండెడ్ వారంటీ వంటి యాడ్-ఆన్‌లు కూడా పొందొచ్చు.

శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 5G ఫోన్ 6.3-అంగుళాల అమోల్డ్ ఔటర్ స్క్రీన్,7.6-అంగుళాల అమోల్డ్ ఇన్నర్ ప్యానెల్‌ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది.

12GB ర్యామ్, 1TB వరకు స్టోరేజ్‌తో వివిధ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. 4,400mAh బ్యాటరీతో వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా కలిగి ఉంది.