బేస్ ప్యాక్ చెల్లిస్తే చాలు: FTA ఛానళ్లపై NCF ఫీ తొలగింపు

టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకోనే అవకాశం ఉంది. ట్రాయ్.. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ఛానళ్ల ఎంపికపై గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

  • Published By: sreehari ,Published On : February 14, 2019 / 12:05 PM IST
బేస్ ప్యాక్ చెల్లిస్తే చాలు: FTA ఛానళ్లపై NCF ఫీ తొలగింపు

Updated On : February 14, 2019 / 12:05 PM IST

టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకోనే అవకాశం ఉంది. ట్రాయ్.. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ఛానళ్ల ఎంపికపై గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

DTH వినియోగదారులకు గుడ్ న్యూస్. సన్ డైరెక్ట్ (Sun Direct), టాటా స్కై(Tata Sky) ఫ్రీ-టూ-ఎయిర్ (FTA) అదనపు ఛానళ్లపై నెట్ వర్క్ కెపాసిటీ (NCF) ఫీ తొలగించాయి. ఈ మేరకు ఓ నివేదిక వెల్లడించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త టారిఫ్ విధానం ప్రకారం.. టీవీ వీక్షకులు తమకు నచ్చిన ఛానళ్లను ఎంచుకోనే అవకాశం ఉంది. ఛానళ్ల ఎంపికపై గందరగోళం నెలకొన్న తరుణంలో ట్రాయ్.. బెస్ట్ ఫిట్ ప్లాన్ కింద ఛానళ్ల ఎంపికపై గడువు తేదీని మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.

ట్రాయ్ గడువు తేదీ పొడిగించడంతో.. DTH ఆపరేటర్లలో టాటా స్కై, సన్ డైరెక్ట్ ఛానల్ డ్రిస్టిబ్యూటర్లు తమ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. అన్నీ డిటిహెచ్ వినియోగదారులు కొత్త డిటిహెచ్, కేబుల్ ప్యాక్ లకు మైగ్రేట్ కావాల్సి ఉంది. DTH ఆపరేటర్లు సైతం.. 100 FTA ఛానళ్లను రూ.130 బేస్ ప్యాక్ తో (అన్నీ ట్యాక్సులతో కలిపి రూ.150) తమ కస్టమర్లకు అందించాల్సిందిగా ట్రాయ్ సూచించింది. Base pack ధరలో కంటెంట్ ఛార్జ్ తో కలిపి నెట్ వర్క్ కెపాసిటీ ఫీ కూడా అందులోనే ఉంటుంది. అందిన నివేదిక ప్రకారం.. టాటా స్కై, సన్ డైరెక్ట్ ఆపరేటర్లు తమ వినియోగదారులకు అందించే అదనపు FTA ఛానళ్లపై NCF ఫీజును తొలగించాయి. సన్ డైరెక్ట్ డిటిహెచ్ ఆపరేటర్.. అన్నీ ఛార్జీలను పూర్తిగా తొలగించగా.. టాటా స్కై మాత్రం పాక్షికంగా ఛార్జీలను తొలగించింది. 

అన్నీ FTA ఛానళ్లు మీ ఇంట్లో..
ట్రాయ్ కొత్త టారిఫ్ ఆధారంగా అందరూ డిటిహెచ్ ఆపరేటర్లు..తమకు వచ్చే లాభాలను రెండు భాగాలుగా విభజించాలి. అందులో మొదటిది కంటెంట్ ఛార్జీలు.. ఇది ఛానల్ ఓనర్లకు పేమెంట్ చేయాలి. రెండోది NCF.. ఈ పేమెంట్ కేబుల్ ఆపరేటర్లకు వెళ్తుంది. బేస్ ప్యాక్ 100 FTA ఛానళ్లు రూ.130పై అందిస్తుండగా.. ఇందులోనే కంటెంట్ ఫీ, నెట్ వర్క్ ఫీ రెండూ ఉంటాయి. అదనపు FTA ఛానళ్లను ఎంపిక చేసుకోవాలంటే NCF ఫీ కింద అదనంగా 25 ఛానళ్లకు రూ. 20 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా చెల్లించే ఈ  NCF ఛార్జీలను సన్ డైరెక్ట్ తొలగించినట్టు టెలికం టాక్ నివేదిక పేర్కొంది.

బేస్ ప్యాక్ లేదంటే.. నెలకు రూ.600 బిల్లు
దీంతో డిటిహెచ్ వినియోగదారులు FTA ఛానళ్లను ఎన్ని కావాలంటే అన్ని కేవలం రూ.130 బేస్ ప్యాక్ (రూ.153 విత్ ట్యాక్స్) ఎంచుకొని చూడొచ్చు. Sun Direct తో పాటు Tata Sky ఆపరేటర్ కూడా FTA ఛానళ్లపై ఎన్ సీఎఫ్ ఛార్జీలను తొలగించింది. కానీ ఇందులో పరిమిత ఛానళ్లను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సన్ డైరెక్ట్ అందించే 330 అన్నీ FTA ఛానళ్లను రూ.130 రెంటల్ పై ఆఫర్ చేస్తోంది. ఒకవేళ సన్ డైరెక్ట్ ఆఫర్ తో అన్నీ FTA ఛానళ్లను ఎంచుకుంటూ పోతే మాత్రం ఒక్కో వినియోగదారుడు నెలసరికి రూ.600 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం సన్ డైరెక్ట్, టాటా స్కై వెబ్ సైట్లలో లాగిన్ అయి ఆఫర్ల వివరాలను తెలుసుకోవచ్చు. 

Also Read : తల్లి పడరాని పాట్లు: కొడుకు కోసం కాలేజీల్లో అమ్మాయిల వేట

Also Read : తండ్రి శవానికి ఐపీఎస్ ఆఫీసర్ నెలరోజులుగా చికిత్స

Also Read : ఎంతో టేస్టీ: ఆయుర్వేదిక్ ఐస్ క్రీం.. రుచి చూడాల్సిందే

Also Read :  ఫిబ్ర‌వ‌రిలోనే లాంచ్‌ : ‘రెడ్ మీ నోట్ 7’ వ‌చ్చేస్తోంది