Tesla Model Y Price : టెస్లా ఈవీ మోడల్ Y కారు ఆగయా.. సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీ రేంజ్.. అమెరికాలో కన్నా భారత్‌లోనే ధర ఎక్కువ..!
Tesla Model Y Price : టెస్లా భారత మార్కెట్లోకి మోడల్ Yతో ప్రవేశించింది. ఎక్స్-షోరూమ్ ధర రూ. 60 లక్షలు. అమెరికాలో కన్నా భారత్ ధర ఎంతంటే?

Tesla Model Y Price
Tesla Model Y Price : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. జూలై 15న టెస్లా తన ఫస్ట్ షోరూమ్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ముంబైలోని BKCలో ప్రారంభించింది. ఈ సెంటర్‌తో పాటు టెస్లా మోడల్ Y కారును కూడా ఆవిష్కరించింది.
ఈ కొత్త Y మోడల్ ఈవీ కారు ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన మోడల్ కాగా, 2024 సంవత్సరంలో ఈ మోడల్‌లో 4 లక్షలకు పైగా కార్లు చైనాలోనే అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఈ టెస్లా Y మోడల్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. కానీ, ఈ ఎలక్ట్రిక్ కారు ధర అత్యంత ఖరీదైనది.
టెస్లా ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం మోడల్ Y మాత్రమే అందుబాటులో ఉంది. ఈ మోడల్ భారత మార్కెట్లో 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇందులో రీడ్ వీల్ డ్రైవ్, లాంగ్ వీల్ డ్రైవ్ ఉన్నాయి.
దేశంలో ఈ టెస్లా Y కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 60 లక్షలు. రియర్-వీల్ డ్రైవ్ మోడల్ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ మోడల్ ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)కు లభ్యం కానుంది. ఆన్-రోడ్ ధరలు వరుసగా రూ. 61.07 లక్షలు, రూ. 69.15 లక్షలకు పెరిగాయి.
అమెరికా : రూ. 37.5 లక్షలు
చైనా : రూ. 29.9 లక్షలు
జర్మనీ : రూ. 45.6 లక్షలు
భారత్‌లో టెస్లా మోడల్ Y ఖరీదైనది ఎందుకంటే? :
అమెరికాలో టెస్లా మోడల్ Y కారు ధర 7,500 డాలర్లు. ఫెడరల్ టాక్స్ క్రెడిట్ తర్వాత 37,490 డాలర్లు (సుమారు రూ. 32 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.. అంటే మన భారత మార్కెట్లో దాదాపు సగం మాత్రమే. ఈ ధరల వ్యత్యాసానికి ప్రధాన కారణం దిగుమతి సుంకమే.
టెస్లా ప్రస్తుతం భారత మార్కెట్లో నిర్మించిన యూనిట్లను (CBU) దిగుమతి చేసుకుంటోంది. వీటిపై అధిక దిగుమతి సుంకాలు విధిస్తున్నారు. కారు CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ 40వేల డాలర్లు దాటితే 100శాతం పన్ను, పరిమితి కన్నా తక్కువ ధర గల కార్లకు 70శాతం పన్నుతో టెస్లా వాహనాల ధర గణనీయంగా పెరుగుతుంది.

Tesla Model Y Price
ఈ ఏడాది ప్రారంభంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ భారత్ ఏ ఒక్క కంపెనీకి అనుగుణంగా విధానాలను రూపొందించదని పునరుద్ఘాటించారు. భారత్ తయారీ స్థావరాలను స్థాపన కోసం ప్రపంచ ఈవీ తయారీదారులను ఆకర్షించే ప్రణాళికలను చేపడుతోంది. కార్బన్ ఉద్గారాలను, చమురు దిగుమతులపై ఆధారపడటాన్నితగ్గించి ఈవీ ఎకోసిస్టమ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని గోయల్ పేర్కొన్నారు.
భారత్‌లో టెస్లా వ్యూహం :
యూరప్, చైనాలో అమ్మకాలు మందగించడంతో టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. నివేదికల ప్రకారం.. కంపెనీ ఇప్పటికే చైనా ప్లాంట్ నుంచి మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ SUV ఫస్ట్ బ్యాచ్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. టెస్లా ఇండియా ఇటీవలే ముంబైలోని లోధా లాజిస్టిక్స్ పార్క్‌లో 24,565 చదరపు అడుగుల వేర్‌హౌస్ స్థలాన్ని ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది.
టెస్లా మోడల్ Y ఫీచర్లు :
ఈ టెస్లా కారులో 15.3-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఉంటుంది. ఫ్రంట్ సీట్లకు హీట్, వెంటిలేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, 8-అంగుళాల వెనుక టచ్‌స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, 8 ఎక్స్‌ట్రనల్ కెమెరాలు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ వంటి అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్లో టెస్లా ఆటో పైలట్ (అటానమస్ డ్రైవింగ్) కోసం అదనంగా రూ. 6 లక్షలు చెల్లించి యూజర్లు టెస్లా మోడల్ Y కారును కొనుగోలు చేయవచ్చు.
టెస్లా మోడల్ Y రీడ్-వీల్ డ్రైవ్ వేరియంట్ :
ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 59.89 లక్షలు, ఆన్-రోడ్ ధర రూ. 62.25 లక్షలు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 201 కి.మీ అందిస్తుంది. ఈ కారు 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు.
లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ :
– రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్)
– రూ. 70.33 లక్షలు (ఆన్-రోడ్)
– 622 కి.మీ రేంజ్
– 201 కి.మీ/గంటకు గరిష్ట వేగం
– 5.6 సెకన్లలో 0-100కి.మీ/గం