Smart TVs Sale Offers : అసలే పండగ సీజన్.. ఈ కొత్త స్మార్ట్‌టీవీలపై ఆఫర్లే ఆఫర్లు.. డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ధర జస్ట్ రూ.5,799 మాత్రమే..!

Smart TVs Sale Offers : పండగ సీజన్ సందడి మొదలైంది.. తక్కువ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ ఆఫర్లను ఎలా పొందాలంటే?

Thomson Smart TV IMAGE SOURCE : THOMSON

Smart TVs Sale Offers : కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి అద్భుతైమన ఆఫర్లు.. అమెజాన్ పండగ సీజన్‌లో అతి చౌకైన ధరకే కొత్త స్మార్ట్ టీవీలను కొనేసుకోవచ్చు. మరో రెండు రోజుల్లో అమెజాన్ గ్రేడ్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. ఈ సేల్ సమయంలో మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.

ప్రముఖ బ్రాండ్లలో ఒకటైన థామ్సన్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ టీవీల (Smart TVs Sale Offers) ధరను భారీగా తగ్గించింది. గతంలో రూ.6,499గా ఉన్న 24-అంగుళాల స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.5,799కి అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో రాబోయే పండుగ సీజన్ అమ్మకాలలో ఈ స్మార్ట్ టీవీలు లభ్యం కానున్నాయి. థామ్సన్ స్మార్ట్ టీవీ మోడళ్లకు సంబంధించి సవరించిన ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.

  • 32-అంగుళాల స్మార్ట్ టీవీ ధర : రూ. 7,999 (రూ. 1,000 తక్కువ)
  • 40-అంగుళాల స్మార్ట్ టీవీ ధర : రూ. 11,999 (రూ. 2,000 తక్కువ)
  • 43-అంగుళాల స్మార్ట్ టీవీ ధర : రూ. 13,499 (రూ. 2,500 తక్కువ)
  • 50-అంగుళాల స్మార్ట్ టీవీ ధర : రూ. 20,999 (రూ. 4,000 తక్కువ)
  • 55-అంగుళాల స్మార్ట్ టీవీ ధర : రూ. 27,999 (రూ. 5,000 తక్కువ)
  • 65-అంగుళాల స్మార్ట్ టీవీ ధర : రూ. 38,999 (రూ. 7,000 తక్కువ)
  • 75-అంగుళాల QD మినీ స్మార్ట్ టీవీ ధర : రూ. 84,999 (రూ. 15,000 తక్కువ)
  • సోనీ కూడా ధరలను 8 శాతం నుంచి 10 శాతం వరకు తగ్గించింది.

సోనీ స్మార్ట్ టీవీ రేంజ్‌లో 5 శాతం నుంచి 10 శాతం ధరల తగ్గింపును ప్రకటించింది. ఉదాహరణకు.. గతంలో రూ.35వేల ధర ఉన్న సోనీ స్మార్ట్ టీవీ ఇప్పుడు దాదాపు రూ.31,500 చెల్లించాల్సి ఉంటుంది. భారతీయ కొనుగోలుదారులకు ప్రీమియం టీవీ మోడళ్లు మరింత సరసమైన ధరకే లభించనున్నాయి.

Read Also : Amazon Early Deals 2025 : అమెజాన్ పండగ సేల్ ఆఫర్లు.. రూ. 30వేల లోపు బెస్ట్ 50 అంగుళాల స్మార్ట్‌టీవీలు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

ఎవరికి ప్రయోజనమంటే?:
కొత్త జీఎస్టీ తగ్గింపు, బ్రాండ్ల ధరల తగ్గింపుతో భారతీయ వినియోగదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా పండుగ ఆన్‌లైన్ అమ్మకాల సమయంలో స్మార్ట్ టీవీలు ఇప్పుడు రూ. 5,799 కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగలకొనుగోలుదారులు ప్రీమియం మోడల్స్, బిగ్ స్క్రీన్‌లపై మెరుగైన డీల్స్ పొందవచ్చు.

జీఎస్టీ తగ్గింపుతో తగ్గిన స్మార్ట్ టీవీ ధరలు :
స్మార్ట్‌టీవీ డిస్‌ప్లేలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు భారీ ఉపశమనం కలిగించింది. ఈ ప్రకటనతో థామ్సన్, సోనీ, LG, శాంసంగ్‌తో సహా అనేక ప్రముఖ బ్రాండ్లు భారత మార్కెట్లో స్మార్ట్ టీవీల ధరలను తగ్గించాయి.