సెలూన్ లో బుక్ చదివితే 30% డిస్కౌంట్

  • Published By: chvmurthy ,Published On : January 1, 2020 / 07:40 AM IST
సెలూన్ లో బుక్ చదివితే 30%  డిస్కౌంట్

Updated On : January 1, 2020 / 7:40 AM IST

స్మార్ట్ ఫోన్లు ప్రపంచాన్ని అరచేతిలో చూపిస్తుంటే ప్రజలు పేపరు, పుస్తకం చదివే అలవాటును మర్చిపోతున్నారు. ఇంకొందరైతే స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు టీవీ కూడా చూడటంలేదు. అంతగా స్మార్ట్ ఫోన్లు మన జీవితాల్లో పెన వేసుకుపోయాయి. పుస్తకం చదివే అలవాటు క్రమేపి  ప్రజలకు దూరం అయ్యింది. కొంతమంది ఇంకా పేపేరు చదువుతున్నారు.

భవిష్యత్తులో పుస్తక పఠనం అంటే ఏమిటీ ?  అనే పరిస్ధితి వచ్చే ప్రమాదం ఉందని భావించిన ఒక క్షురకుడు తన సెలూన్ లో లైబ్రరీ ఏర్పాటు చేశాడు. తమిళనాడులోని ట్యూటికోరన్ కు చెందిన మరియప్పన్ తన సెలూన్ లో ఈ లైబ్రరీ ఏర్పాటు చేశాడు. స్మార్ట్ ఫోన్ వాడకంతో ప్రజలు పుస్తక పఠనం మర్చిపోయారని…పుస్తకంచదివే అలవాటు పెంపోందించేందుకు ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టానని చెప్పాడు.

షాపుకు వచ్చి వెయిటింగ్‌ చేస్తున్న సమయంలో పుస్తకాలను చదివేలా ప్రోత్సహిస్తున్నాను. న్యూ ఇయర్‌ నుంచి సెలూన్‌ రేట్లు పెంచుతున్నాను. తన షాపుకు వచ్చి పుస్తక పఠనం చేసి.. కటింగ్‌ చేయించుకుంటే 30 శాతం డిస్కౌంట్ ఇస్తాను. పుస్తకాలుచదవటం వల్ల మనిషిలో మార్పు వస్తుంది. నవలలు, కథల పుస్తకాలతో పాటు ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే పుస్తకాలను తన లైబ్రరీలో ఏర్పాటు చేసినట్లు మరియప్పన్‌ తెలిపాడు.