Top 10 Selling SUVs 2025 : హాట్ కేకుల్లా తెగ కొనేశారు.. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 SUVలు.. బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే..!

Top 10 Selling SUVs 2025 : భారతీయ కార్ల మార్కెట్ అమ్మకాలతో దూసుకుపోతోంది. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 SUV మోడల్స్ ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

Top 10 Selling SUVs 2025 : హాట్ కేకుల్లా తెగ కొనేశారు.. 2025లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 SUVలు.. బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే..!

Top 10 Selling SUVs

Updated On : December 11, 2025 / 10:33 AM IST

Top 10 Selling SUVs 2025 : 2025లో భారతీయ ఆటోమొబైల్ ఇండస్ట్రీ భారీ అమ్మకాలతో దూసుకపోతోంది. నవంబర్ 2025లో గత ఏడాదితో పోలిస్తే (YoY) గణనీయమైన వృద్ధిని సాధించింది. నవంబర్ 2024లో 351,592 యూనిట్లతో పోలిస్తే.. గత నెలలో మొత్తం 417,495 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. SUV విభాగంలో ముందుంది. టాటా నెక్సాన్ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. ఆ తర్వాత పంచ్, క్రెటా, స్కార్పియో ఉన్నాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ SUVలో ఏయే కార్లు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టాటా నెక్సాన్ 22,434 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 15,329 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 46శాతం పెరుగుదలగా చెప్పొచ్చు. టాటా నుంచి వచ్చిన పంచ్, నవంబర్ 2024లో అమ్ముడైన 11,779 యూనిట్లతో పోలిస్తే.. 18,753 యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ మైక్రో SUVకి కొత్త అప్‌డేట్ 2026 ప్రారంభంలో రానుంది. ఆసక్తికరంగా, నెక్సాన్ హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియోలను కూడా అధిగమించింది.

మూడో స్థానంలో హ్యుందాయ్ క్రెటా :
హ్యుందాయ్ క్రెటా 3వ స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో 15,452 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంఖ్య 17,344కు పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో మహీంద్రా స్కార్పియో కూడా ఉంది. 15,616 యూనిట్లను అమ్మింది. 23శాతం YYY వృద్ధిని సాధించింది. మారుతి సుజుకికి చెందిన ఫ్రాంక్స్, విటారా బ్రెజ్జా, విక్టోరియాస్ ఐదు, ఆరు, ఏడవ స్థానాల్లో నిలిచాయి.

Read Also : Mobile Recharge Hike : బిగ్ షాకింగ్ న్యూస్.. కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు.. ఎయిర్‌టెల్, జియో, Vi యూజర్లలో ఆందోళన!

10వ స్థానంలో గ్రాండ్ విటారా :
నవంబర్ 2024లో కియా సోనెట్ 9,255 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే.. 12,051 యూనిట్లను విక్రయించింది. 30శాతం వృద్ధితో 8వ స్థానంలో నిలిచింది. ఇటీవల కొత్త జనరేషన్ అప్‌డేట్ పొందిన హ్యుందాయ్ వెన్యూ, 11,645 యూనిట్లను విక్రయించి 9వ స్థానంలో నిలిచింది. చివరగా, మారుతి గ్రాండ్ విటారా గత ఏడాదిలో 10,148 యూనిట్లతో పోలిస్తే ఏకంగా 11,339 యూనిట్లను విక్రయించి 10వ స్థానంలో నిలిచింది.

త్వరలో కొత్త పంచ్ వెర్షన్ :
టాటా మోటార్స్ త్వరలో పంచ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయనుంది. మైక్రో-SUV అప్‌డేట్ కొత్త ఫొటోలు వెలువడ్డాయి. రాబోయే మోడల్ కేరళలో కనిపించిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. కొత్త ఫోటోలను పరిశీలిస్తే.. గతంలో కన్నా ఎక్కువ మార్పులను వెల్లడిస్తున్నాయి. లేటెస్ట్ టెస్ట్ మ్యూల్ కొత్త డిజైన్ ఫీచర్లు ఉన్నట్టు కనిపిస్తోంది. 2026లో లాంచ్‌కు ముందు ఫీచర్లు, ధర వివరాలు రివీల్ అయ్యే అవకాశం ఉంది.