Top 10 Smart TVs
Top 10 Smart TVs : కొత్త స్మార్ట్ టీవీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఈ పండగ సీజన్‌లో భారీ తగ్గింపు ధరకే కొత్త స్మార్ట్‌టీవీలు లభ్యమవుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఇష్టమైన స్మార్ట్‌ఫోన్లు, హోం అప్లియన్సెస్, బ్యూటీ ప్రొడక్టులు, ఇతర గాడ్జెట్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్ టాప్ అతి తక్కువ ధరకే కొనేసుకోవచ్చు.
ఈ సేల్ ఈరోజు (అక్టోబర్ 2)తో ముగుస్తోంది. మీరు కూడా (Top 10 Smart TVs) రూ. 10వేల బడ్జెట్ లోపు భారీ డిస్కౌంట్‌తో బెస్ట్ స్మార్ట్‌టీవీ కోసం చూస్తుంటే ఇదే లాస్ట్ ఛాన్స్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ. 10వేల లోపు టాప్ 10 స్మార్ట్ టీవీలను మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్‌టీవీని కొనేసుకోవచ్చు.
1. యూనిబూమ్ అల్టిమా (32 అంగుళాలు) :
యూనిబూమ్ అల్టిమా (Uniboom ULTIMA) స్మార్ట్ టీవీ 32-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 30W సోనిక్ బూమ్ స్పీకర్ పొందుతారు. ఆరా విజన్ ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్ టీవీలోని యాప్ స్టోర్‌లో మీరు 1,000+ సర్టిఫైడ్ యాప్స్ యాక్సస్ చేయొచ్చు. స్మార్ట్ టీవీ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో ఈజీ స్క్రీన్ మిర్రరింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 28,990 లాంచ్ కాగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 74శాతం తగ్గింపుతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 7,390కే కొనేసుకోండి.
మోటోరోలా క్యూఎల్ఈడీ HD రెడీ స్మార్ట్‌టీవీ 32 అంగుళాలు 40W స్పీకర్లతో వస్తుంది. అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. రూ. 5వేల వరకు విలువైన ఈ స్మార్ట్ టీవీతో పాటు ఫ్లిప్‌కార్ట్ గ్రోసరీ, క్లియర్‌ట్రిప్, ఈజీ డిన్నర్ డిస్కౌంట్ కూపన్లు వంటివి అనేక బెనిఫిట్స్ పొందవచ్చు. గూగుల్ టీవీ 5.0కి సపోర్టు ఇస్తుంది. 60 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 1GB ర్యామ్, 8GB ROMతో వస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియిన్ డేస్ సేల్‌లో 65శాతం తగ్గింపు తర్వాత రూ. 9,399కు టీవీ కొనేసుకోవచ్చు.
3. ఫాక్స్‌స్కీ HD రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ :
ఫాక్స్‌స్కీ HD రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32-అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీలో క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పాటు 30W సరౌండ్ సౌండ్ స్పీకర్ పొందవచ్చు. అద్భుతమైన సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 68శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ టీవీని దాదాపు రూ. 6,999కు కొనుగోలు చేయొచ్చు.
4. రియల్‌మి టెక్‌లైఫ్ (32 అంగుళాలు) :
రియల్‌మి టెక్‌లైఫ్ క్యూఎల్ఈడీ HD రెడీ స్మార్ట్‌టీవీ 32-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. మీరు డాల్బీ ఆడియోతో 26W స్పీకర్‌లు మొత్తం 5 సౌండ్ మోడ్‌లను పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీ క్రిస్టల్ క్లియర్ పిక్చర్స్, వైబ్రెంట్ కలర్ ఆప్షన్లను అందిస్తుంది. హెచ్‌డీఆర్10కి సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో 1జీబీ ర్యామ్ ప్లస్ 8GB ROM లభిస్తుంది. క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో కూడా వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 60శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌టీవీని రూ. 9,499కే కొనుగోలు చేయొచ్చు.
బెస్టాన్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 32-అంగుళాల విస్టా సిరీస్ స్క్రీన్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో అనే న్యూస్ ఛానెల్స్, OTT ప్లాట్‌ఫామ్ సపోర్టును అందిస్తుంది. అద్భుతైమన పర్ఫార్మెన్స్ అందించే ప్రాసెసర్‌తో వస్తుంది. 20W సౌండ్ అవుట్‌పుట్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 61శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు దాదాపు రూ. 6,999 చెల్లిస్తే సరిపోతుంది.
6. మార్క్యూ బై ఫ్లిప్‌కార్ట్ HD రెడీ ఎల్ఈడీ టీవీ :
మార్క్యూ ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ టీవీ 32-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. క్రిస్టల్-క్లియర్ ఇమ్మర్సివ్ డిస్‌ప్లే, 178-డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో హెవీ బాస్ ఆడియోను పొందవచ్చు. మల్టీ పోర్ట్‌లతో సులభంగా కనెక్ట్ అవుతుంది. ఈ స్మార్ట్‌టీవీ 24W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌టీవీ ప్రస్తుత ధర రూ. 17వేలు ఉండగా 61శాతం తగ్గింపుతో కేవలం రూ.6,599కే టీవీని కొనుక్కోవచ్చు.
ఇన్ఫినిక్స్ HD రెడీ ఎల్ఈడీ స్మార్ట్ లైనక్స్ టీవీ 32-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. ప్రైమ్ వీడియో కీలతో స్లిమ్ రిమోట్ కంట్రోల్‌తో వస్తుంది. మీకు Wi-Fi, 2 HDMI, 1 USB పోర్ట్ లభిస్తాయి. స్మార్ట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 16W బాక్స్ స్పీకర్లు కలిగి ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో 61,245 కన్నా ఎక్కువ రేటింగ్‌లతో 4.2 స్టార్ రేటింగ్ పొందింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు దాదాపు రూ. 7,699 చెల్లించాలి.
8. సాన్సుయ్ నియో HD రెడీ ఎల్ఈడీ స్మార్ట్ లైనక్స్ టీవీ :
సాన్సుయ్ నియో హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 32-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. బెజెల్-లెస్ డిజైన్ యాక్సెస్ కోసం హాట్‌కీలతో రిమోట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీలో 24W సౌండ్ అవుట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్‌ను పొందుతారు. 51శాతం తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుకు దాదాపు రూ.9,700 చెల్లించాలి.
9. రిలయన్స్ HD రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ :
రిలయన్స్ HD రెడీ ఎల్ఈడీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 32-అంగుళాల స్క్రీన్ సైజుతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో మీరు 10వేలకు పైగా ఫ్రీ సినిమాలు, మొత్తం 8GB స్టోరేజీని పొందవచ్చు. మీరు ఎలాంటి సమస్య లేకుండా మీకు ఇష్టమైన కంటెంట్‌ను వీక్షించవచ్చు. 250+ ఫ్రీ లైవ్ టీవీ ఛానెల్స్ కూడా కలిగి ఉంది. 20W సౌండ్ అవుట్‌పుట్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో 50శాతం తగ్గింపుతో దాదాపు రూ.9,990తో కొనేసుకోవచ్చు.
10. థాంప్సన్ ఆల్ఫా క్యూఎల్ఈడీ :
థాంప్సన్ ఆల్ఫా క్యూఎల్ఈడీ స్మార్ట్ టీవీ 32-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. 5వేలకు పైగా యాప్‌లు, గేమ్‌లకు సపోర్టు ఇస్తుంది. 36W సౌండ్ అవుట్‌పుట్ అందిస్తుంది. జియో, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, జీ5, సోనీ లైవ్ యాప్‌లకు సపోర్టు ఇస్తుంది. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. 178-డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో స్పష్టమైన కలర్ ఆప్షన్లను అందిస్తుంది. 48శాతం తగ్గింపు తర్వాత ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు కేవలం రూ. 7,799 చెల్లించాల్సి ఉంటుంది.