Fast Charging Electric Bikes
Fast Charging Electric Bikes : కొత్త ఎలక్ట్రిక్ బైకుల కోసం చూస్తున్నారా? ప్రస్తుతం భారత మార్కెట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ బైకులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో (Fast Charging EV Bikes) ఇంధనంతో నడిచే బైకుల కన్నా ఎలక్ట్రిక్ బైకులకే ఫుల్ డిమాండ్ పెరిగింది. చాలామంది వినియోగదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ బైకులనే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ ఎలక్ట్రిక్ బైక్‌లతో ఇంధన ఆదా మాత్రమే కాదు.. స్పీడ్, ఫీచర్లు, స్పీడ్ ఛార్జింగ్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ప్రతిరోజూ ఎలక్ట్రిక్ బైకులను వాడే వినియోగదారులకు ముఖ్యంగా నగరాల్లో గంటల తరబడి రీఛార్జ్ చేయడం సరైనది కాదు. 2025లో, కొత్త జనరేషన్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి.
2025లో అల్ట్రావయోలెట్ F77, టోర్క్ క్రాటోస్ R, మ్యాటర్ ఏరా 5000+, ఒబెన్ రోర్ వంటి బైక్‌లు గేమ్ ఛేంజర్ మార్చేస్తున్నాయి. 50 నిమిషాల ఛార్జింగ్ నుంచి 300 కి.మీ పరిధి వరకు ఈ ఈవీ బైకులు స్మార్ట్ ఇండియన్ రైడర్‌లకు మరింత ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ఈ బైకుల వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
అల్ట్రావయోలెట్ F77 బైక్ :
అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్ పర్ఫార్మెన్స్ పరంగా అద్భుతంగా ఉంటుంది. సింగిల్ ఛార్జ్ చేస్తే 300 కి.మీ వరకు ప్రయాణించగలదు. 50 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాన్ని కలిగి ఉంది. స్పోర్టీ డిజైన్, TFT స్క్రీన్, రైడింగ్ మోడ్‌లను కూడా కలిగి ఉంది. పవర్, ఫాస్ట్ రీఛార్జింగ్ కోసం చూస్తున్న వినియోగదారులకు బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ అని చెప్పొచ్చు.
టోర్క్ క్రాటోస్-R :
టోర్క్ క్రాటోస్-R ఎలక్ట్రిక్ బైక్.. రైడర్లు ఎక్కువగా కోరుకునే బైకుల్లో ఇదొకటి. పూణేలోని టోర్క్ మోటార్స్ రూపొందించిన ఈ ఇ-బైక్ 180 కి.మీ రేంజ్ అందిస్తుంది. కేవలం 60 నిమిషాల్లో 80శాతం ఛార్జ్ అవుతుంది. మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్, రైడ్ ఇన్‌సైట్స్, స్టేబుల్ మేనేజ్‌మెంట్‌తో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ కోరుకునే రోజువారీ రైడర్‌లకు బెస్ట్ ఈవీ బైక్.
మ్యాటర్ ఏరా 5000+ :
మ్యాటర్ ఏరా 5000+ బైక్ (Fast Charging EV Bikes) సరికొత్తగా ఆకర్షణీయంగా ఉంటుంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో భారత మార్కెట్లో వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్. 125 కి.మీ నుంచి 150 కి.మీ మైలేజీతో వస్తుంది. గంటలోపు 80శాతం ఛార్జ్ చేయవచ్చు. టచ్‌స్క్రీన్, నావిగేషన్, ఫుల్ కనెక్టివిటీ వంటి లైట్ టెక్నాలజీతో వస్తుంది. టెక్ ప్రియులకు అద్భుతమైన బైక్.
ఒబెన్ రోర్ :
సిటీ రైడర్ల కోసం ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ అద్భుతంగా ఉంటుంది. రైడింగ్ చేసేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. 150 కి.మీ రేంజ్, గరిష్టంగా గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ బ్యాటరీని దాదాపు 2 గంటల్లో 80శాతం ఛార్జ్ చేస్తుంది. యాప్ కనెక్టివిటీతో పాటు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్ అందిస్తుంది. సిటీ రైడర్‌లకు సరైన బైక్ అని చెప్పవచ్చు.