దేశంలో చైనా ఉత్పత్తులు బైకాట్.. రికార్డు స్థాయిలో దివాళీ అమ్మకాలు..

Traders record sales on Diwali amid boycott of Chinese products : భారతదేశంలో చైనా ఉత్పత్తులపై నిషేధం విధించడంతో దేశీయ ట్రేడర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధాన మార్కెట్లలో ఈ ఏడాది దివాళీ అమ్మకాలు దాదాపు 72వేల కోట్లతో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.
ఈ మేరకు ట్రేడర్స్ విభాగం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఒక ప్రకటనలో వెల్లడించింది. 2020 ఏడాదిలో దీపావళి సమయంలో దేశీయ ఉత్పత్తుల అమ్మకాలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. చైనా ఉత్పత్తులను బైకాట్ చేయాలంటూ CAIT పిలుపునివ్వడంతో ట్రేడర్లంతా దేశీయ ఉత్పత్తుల అమ్మకాలపైనే దృష్టిపెట్టారు.
దేశంలో మొత్తంగా 20 వేర్వేరు నగరాల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. అందులోనూ దీపావళి పండుగ సీజన్ కావడంతో అమ్మకాలు రికార్డు స్థాయిలో రూ.72వేల కోట్లు టర్న్ ఓవర్ జరిగినట్టు తెలిపింది. తద్వారా డ్రాగన్ చైనాకు రూ.40వేల కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేసినట్టు ప్రకటనలో తెలిపింది.
దాదాపు 20 నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్ కతా, నాగపూర్, రాజ్ పూర్, భువనేశ్వర్, రాంచీ, భూపాల్, లక్నో, కన్పూర్, నోయిడా, జమ్మూ, అహ్మద్, సురత్, కోచిన్, జైపూర్, చండీగఢ్ నగరాల్లో ఎక్కువగా పంపిణీ ఉత్పత్తుల అమ్మకాలు జరిగాయని CAIT తమ సర్వేలో వెల్లడించింది.
దివాళీ పండుగ సీజన్‌లో వాణిజ్య మార్కెట్లలో రికార్డు స్థాయిలో అమ్మకాలు పెరగడం భవిష్యతు దేశీయ ఉత్పత్తులకు ఆశించిదగిన పరిణామంగా పేర్కొన్నారు.
FMCG వస్తువులు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కిచెన్ సామాగ్రి సహా గిఫ్ట్ ఐటమ్స్, హోం ఫర్నీషింగ్, గిన్నెలు, బంగారం, జ్యువెలరీ, ఫుట్ వేర్, వాచ్ లు, ఫర్నీచర్, పూలదండలు, బట్టలు, హోం డెకరేషన్ వంటి అనేక రకాల ఉత్పత్తులు దివాళీ అమ్మకాల్లో ఎక్కువగా ఉన్నాయి.