TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకి భారీ ఊరట.. తగ్గనున్న రీఛార్జ్ ధరలు
TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకి ట్రాయ్ శుభవార్త చెప్పింది. రీచఛార్జ్ ధరలు తగ్గనున్నాయి.
TRAI said telecom giants must offer voice and SMS only packs in all validity periods with less price
- మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త
- త్వరలోనే కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లు
- తగ్గనున్న రీఛార్జ్ ధరలు
TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. డేటా అవసరం లేని మొబైల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. వారి కోసం వాయిస్, SMS మాత్రమే ఉండే ప్లాన్లను మాత్రమే తీసుకురావాలని సూచించింది. ఈ క్రమంలో టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) విడుదల చేసిన డ్రాఫ్ట్ ప్రకారం, టెలికాం కంపెనీలన్నీ.. ప్రస్తుతం వాయిస్, డేటా, SMSలతో కలిపి ఏయే కాలపరిమితితో అంటే.. ఉదాహరణకు 28 రోజులు, 56 రోజులు, 84 రోజుల వరకు ప్లాన్లను అందిస్తున్నాయో.. అదే వ్యాలిడిటీతో.. కేవలం వాయిస్, SMSలు మాత్రమే ఉండే ప్రత్యేక ప్లాన్లను కూడా తప్పనిసరిగా అందించాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.
అలానే ఈ నాన్ డేటా ప్లాన్ల ధరలు.. డేటాతో కూడిన ప్లాన్ల ధరల కన్నా తక్కువగా ఉండాలని ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఆయా ప్లాన్లలో డేటాను తొలగించినందుకు.. ఆ మేరకు ధరను కూడా తగ్గించాలని సూచించింది. దీనిపై స్టేక్ హోల్డర్లు, ప్రజలు తమ అభిప్రాయాలను ఏప్రిల్ 28 నాటికి లిఖితపూర్వకంగా లేదా ఈమెయిల్ (fea1-div@trai.gov.in) ద్వారా సమర్పించవచ్చని ట్రాయ్ సూచించింది.
చాలా మంది వినియోగదారులు తమకు డేటా అవసరం లేదని.. దాని స్థానంలో తక్కువ ధరలో కాల్స్, SMSలు కలిగిన రీఛార్జ్ ప్లాన్లు కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రతి టెలికాం కంపెనీ.. కనీసం ఒక ప్రత్యేక టారిఫ్ వోచర్ (STV)ను కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ కోసం మాత్రమే అందించాలని ట్రాయ్ గతంలోనే ఆదేశించింది. కానీ టెలికాం కంపెనీలు కేవలం కొన్ని ప్లాన్లలోనే ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయని ట్రాయ్ గుర్తించింది. వాయిస్, ఎస్ఎంఎస్ లు మాత్రమే కలిగి ఉండే ప్యాక్ల లభ్యత చాలా తక్కువగా ఉంది. దీనిపై వినియోగదారుల నుండి అనేక ఫిర్యాదులు రావడంతో.. ట్రాయ్ ఈ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, ఇంటర్నెట్ వాడని సాధారణ మొబైల్ వినియోగదారులకు రీఛార్జ్ భారం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది.
TRAI new rules: మీ కోసం ట్రాయ్ గేమ్ ఛేంజర్ నిర్ణయం.. ఇక స్పామ్ కాల్స్ బాధ వదిలిపోతుంది పో..
ప్రస్తుత టెలికాం కంపెనీలు అందిస్తున్న నో డేటా ప్లాన్ల వివరాలు:
- ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా (Vi) రూ.99 ప్లాన్ను అందిస్తోంది. ఇందులో రూ.99 టాక్టైమ్, 200MB డేటా 15 రోజుల పాటు లభిస్తుంది. అలాగే 28 రోజుల ప్లాన్లో 2GB డేటా, 300 SMSలతో అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది.
- ఎయిర్టెల్ కొన్ని ప్రాంతాల్లో రూ.155 ప్లాన్ను 24 రోజుల వాలిడిటీతో 1GB డేటాతో అందిస్తోంది. అలాగే రూ.199 ప్లాన్లో 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్, 2GB డేటా, 300 SMSలు ఉన్నాయి.
- రిలయన్స్ జియో రూ.198 ప్లాన్లో 14 రోజుల వాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తోంది.
