Trump New Tariffs : ట్రంప్ మరో యూ-టర్న్.. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, చిప్‌లపై టారిఫ్స్ రద్దు.. ఆపిల్, శాంసంగ్‌కు బిగ్ రిలీఫ్..!

Trump New Tariffs : ట్రంప్ ప్రభుత్వం టారిఫ్స్‌పై వెనక్కి తగ్గడంతో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, చిప్‌లను టారిఫ్ జాబితా నుంచి మినహాయించారు. చాలా ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి.

Trump New Tariffs

Trump New Tariffs : చైనా ఉత్పత్తులపై విధించిన సుంకానికి సంబంధించి డోనాల్డ్ ట్రంప్ మరోసారి యూ-టర్న్ తీసుకున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, సెమీకండక్టర్ చిప్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై ప్రతీకార సుంకాల నుంచి మినహాయించనున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది.

Read Also : VIVO 5G Smartphones : వివో లవర్స్‌కు కోసం రూ.15వేల లోపు ధరలో బెస్ట్ 5G ఫోన్లు ఇవే.. ఏ ఫోన్ కొంటారో మీ ఇష్టం..!

ఈ ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ నుంచి వచ్చిన నోటీసు ప్రకారం.. చైనాపై విధించిన ప్రస్తుత 145 శాతం సుంకం లేదా ఇతర దేశాలపై విధించిన 10 శాతం బేస్‌లైన్ సుంకం కింద ఈ ఉత్పత్తులకు కొత్త సుంకం వర్తించదు. ఏప్రిల్ 9న సుంకాలను విధించిన 13 గంటల తర్వాత, చైనా మినహా చాలా దేశాలకు 90 రోజుల పాటు సుంకాలను నిలిపివేసింది.

ఈ పెద్ద కంపెనీలకు భారీ ప్రయోజనం :
నోటీసుల ప్రకారం.. ఏప్రిల్ 5కి ముందు అమెరికాకు వచ్చిన లేదా వేర్‌హౌస్ నుంచి తొలగించిన ఉత్పత్తులకు మినహాయింపు వర్తిస్తుంది. ఆపిల్, శాంసంగ్ కంపెనీలకు ఎన్విడియా వంటి చిప్ తయారీదారులకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం వల్ల గాడ్జెట్ల ధరలు ఆకాశాన్నంటుతాయని టెక్ దిగ్గజాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై నోటీసులో ఎలాంటి వివరణ ఇవ్వలేదు.

భారత్‌, చైనాలో ఐఫోన్లు తయారీ :
ఆపిల్ ఐఫోన్లలో దాదాపు 80 శాతం చైనాలో అసెంబుల్ అవుతున్నాయి. మిగిలిన 20 శాతం భారత మార్కెట్లో తయారవుతున్నాయని యూఎస్ ఏజెన్సీ అంచనా వేసింది. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లతో పాటు, ఇతర డిస్క్ డ్రైవ్‌లు, డేటా ప్రాసెసింగ్ డివైజ్‌లు సెమీకండక్టర్ డివైజ్‌లు, మెమరీ చిప్‌లు, ఫ్లాట్-ప్యానెల్ డిస్‌ప్లేలు, టెలికమ్యూనికేషన్ డివైజ్‌‌లు, చిప్‌మేకింగ్ మిషన్స్, రికార్డింగ్ డివైజ్‌‌లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ వంటి ప్రొడక్టులతో కూడా మినహాయింపు పొందవచ్చు.

Read Also : Best Budget Cars : కొత్త కారు కొంటున్నారా? అత్యంత సరసమైన ధరకే 5 బెస్ట్ బడ్జెట్ కార్లు.. ఓసారి లుక్కేయండి..!

ఇందులో చాలా వరకు ప్రొడక్టులు అమెరికాలోనే చాలా తయారవుతాయి. ఈ ఉత్పత్తుల కోసం దేశీయ ఉత్పత్తి సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు ఏళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు.