Gold: బంగారంలో ఎన్ని రకాల పెట్టుబడులు ఉన్నాయి? ఇలా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులే డబ్బులు
గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి.

అత్యంత విలువైన వస్తువులలో ‘బంగారం’ ఒకటని అందరికి తెలిసిన విషయమే. అయితే, బంగారంపై ఆభరణాల రూపంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి అనేక మార్గాలు ఉన్నాయి.
బంగారంపై పెట్టుబడి మనకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడమే కాకుండా అనుకోని ఆర్థిక సంక్షేభం ఎదురైనపుడు బంగారం మనకు దారి చూపిస్తుంది అనేదానిలో ఎలాంటి సందేహం లేదు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు లేక మరే ఇతర కారణాల వల్ల అయినా కావచ్చు.. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మున్ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Also Read: రికార్డులను బ్రేక్ చేసే రేంజ్‌లో బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఫుల్ డీటెయిల్స్..
- బంగారం కొని నగలు చేయించుకోవడం లేక రెడీమేడ్ జ్యుయెలరీ కొనడం.. అలాగే నాణేలు లేదా బార్ల రూపంలో ఫిజికల్ గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. ఇవి భవిష్యత్తులో మీకు ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడతాయి
- డీమ్యాట్ అకౌంట్ తీసుకొని ‘స్టాక్ ఎక్స్చేంజ్’లలో ట్రేడింగ్ ద్వారా గోల్డ్ ETFలను కొనుగోలు చేయొచ్చు
- Paytm Gold, MMTC-PAMP వంటి సంస్థలు డిజిటల్ వాలెట్ల ద్వారా బంగారాన్ని అందిస్తున్నాయి. మీరు కొనుగోలు చేసిన బంగారం ఎంతనో, దాని ధర ఎంతనో చూపిస్తుంది. అలాగే అవసరమైతే మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డెలివరీ ద్వారా బంగారాన్ని పొందవచ్చు.
- బంగారంతో సంబంధం ఉన్న కంపెనీలలో అంటే బంగారు మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టొచ్చు
- ప్రముఖ జ్యూవెలరీ దుకాణాలు లేదా బ్యాంకులు నెలవారీగా బంగారం కొనే అవకాశం కల్పించే గోల్డ్ సేవింగ్స్ లలో పెట్టుబడి పెట్టొచ్చు
- గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలి. ఫిజికల్ బంగారం కంటే, గోల్డ్ ETFలు, అలాగే డిజిటల్ గోల్డ్ పెట్టుబడిదారులకు మంచి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.