×
Ad

UPI Payments : విదేశాలకు వెళ్తున్నారా? ఈ 10 దేశాల్లో భారతీయ యూజర్లు ఈజీగా UPI పేమెంట్లు చేసుకోవచ్చు.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

UPI Payments : యూపీఐ పేమెంట్లు ఇకపై జపాన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి. భారతీయ పర్యాటకులు తమ మొబైల్ ద్వారా డిజిటల్ పేమెంట్లు చేసుకోవచ్చు.

UPI Payments

UPI Payments : యూపీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. విదేశాల్లో కూడా యూపీఐ పేమెంట్లకు ఫుల్ డిమాండ్ పెరుగుతోంది. భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విస్తరణ అంతర్జాతీయంగా కనిపిస్తోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన NIPL, NTT డేటా జపాన్‌తో ఒప్పందంపై సంతకం చేసింది.

తద్వారా భారతీయ పర్యాటకులు జపాన్‌లో (UPI Payments) తమ మొబైల్ ఫోన్‌లలో యూపీఐ యాప్‌ను ఉపయోగించి పేమెంట్లు చేసుకోవచ్చు. ఈ డీల్ ప్రకారం.. జపాన్ దుకాణదారులు QR కోడ్‌ స్కాన్ ద్వారా యూపీఐ పేమెంట్లను అనుమతిస్తారు. భారతీయ పర్యాటకులు క్యాష్ లేదా ఫారెక్స్ కార్డులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

జపాన్‌లో యూపీఐకి ఫుల్ డిమాండ్ :
2025 జనవరి నుంచి ఆగస్టు మధ్య జపాన్‌కు వచ్చిన భారతీయ పర్యాటకుల సంఖ్య 280,000 దాటింది. ఎన్టీటీ డేటాలో పేమెంట్ హెడ్ మసనోరి కురిహర ప్రకారం.. యూపీఐ చెల్లింపులతో జపాన్ విక్రేతలు భారతీయ పర్యాటకులతో మరింత సులభంగా లావాదేవీలు జరుపుకునేందుకు వీలుంటుంది. ఈ భాగస్వామ్యంతో జపాన్ పర్యాటక రంగం కూడా బలోపేతమవుతుంది.

Read Also : Samsung Galaxy S26 Ultra : శాంసంగ్ లవర్స్ గెట్ రెడీ.. ఈ గెలాక్సీ S26 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్ డేట్, ధర, ఫుల్ ఫీచర్లు లీక్..

ఈ దేశాల్లో యూపీఐ సర్వీసులు :
యూపీఐ సర్వీసులు ఇప్పటికే ఫ్రాన్స్, UAE, నేపాల్, మారిషస్, పెరూ, సింగపూర్, శ్రీలంక, ఖతార్, భూటాన్‌లలో అందుబాటులో ఉంది. జపాన్‌తో పాటు NPCI 2025లో థాయిలాండ్, ఖతార్, ఆగ్నేయాసియా దేశాలతో సహా 4 నుంచి 6 కొత్త దేశాలకు యూపీఐని విస్తరించాలని యోచిస్తోంది.

భారత్‌లో యూపీఐ విస్తరణ :
జూలై 2025 నాటికి భారత్‌లో దాదాపు 491 మిలియన్ల మంది యూపీఐని వాడుతున్నారు. 6.5 మిలియన్లకు పైగా మర్చంట్స్ కనెక్ట్ అయ్యారు. దేశంలోని డిజిటల్ లావాదేవీలలో యూపీఐ దాదాపు 85శాతం వాటాను కలిగి ఉంది. ప్రపంచంలోని మొత్తం రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్లలో సగం వాటాను యూపీఐ కలిగి ఉంది.

ఈ భాగస్వామ్యంతో భారతదేశ డిజిటల్ పేమెంట్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందింది. యూపీఐ ఇకపై భారత్ మాత్రమే పరిమితం కాదు. భారతీయ ప్రయాణికులు తమ విదేశీ పర్యటనల సమయంలో వేగవంతమైన డిజిటల్ పేమెంట్లను చేసుకోవచ్చు.