Vivo T4 Ultra : ఇది కదా ఆఫర్.. ఈ వివో T4 అల్ట్రా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో‌ జస్ట్ ఎంతంటే?

Vivo T4 Ultra : ఈ వివో ఫోన్ చాలా చీప్.. బ్యాంకు ఆఫర్లతో భారీ డిస్కౌంట్ తో కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ డీల్ ఎలా పొందాలంటే?

Vivo T4 Ultra : ఇది కదా ఆఫర్.. ఈ వివో T4 అల్ట్రా ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో‌ జస్ట్ ఎంతంటే?

Vivo T4 Ultra (Image Credit To Original Source)

Updated On : January 10, 2026 / 4:36 PM IST
  • వివో T4 అల్ట్రా ఫోన్ స్పెషిఫికేషన్లు
  • బ్యాంకు ఆఫర్లతో ఈ వివో ఫోన్ భారీ తగ్గింపు
  • రూ. 19050 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 5834 నో-కాస్ట్ ఈఎంఐ
  • రూ.40999 ధరకు వివో ఫోన్ సొంతం చేసుకోవచ్చు

Vivo T4 Ultra : కొత్త వివో ఫోన్ కొనేవారికి అదిరిపోయే డిస్కౌంట్.. అద్భుతమైన కెమెరాతో ప్రీమియం ఫోన్ కోసం చూస్తుంటే ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. ప్రస్తుతం ఆకర్షణీయమైన కెమెరా డిజైన్‌తో వివో T4 అల్ట్రా 5G హ్యాండ్‌సెట్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది.

కెమెరా పరంగా ఈ ఫోన్ కొనేందుకు వివో లవర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ వివో T4 అల్ట్రా ఫోన్ కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని డీల్స్ ఓసారి లుక్కేయండి.

వివో T4 అల్ట్రాపై 12శాతం తగ్గింపు :
ఈ వివో ఫోన్ రూ.40999 ధరకు లభిస్తుంది. మీరు ఫ్లిప్‌కార్ట్ సేల్ నుంచి 12శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపుతో ధర రూ.35999 అవుతుంది. అయితే, ఈ ఫోన్ ధరను మరింత తగ్గించవచ్చు.

అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లు :
బ్యాంక్ ఆఫర్ కింద మీరు HDFC, SBI Axis బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 1000 తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేస్తే మీరు రూ. 19050 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. అంతే కాదు.. రూ. 5834 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.

Vivo T4 Ultra

Vivo T4 Ultra (Image Credit To Original Source)

వివో T4 అల్ట్రా ఫోన్ ఫీచర్లు :
భారీ డిస్‌ప్లే :
ఈ వివో మోడల్ 6.67-అంగుళాల డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. రిజల్యూషన్ 2800×1260 పిక్సెల్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 1600 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్ కూడా అందిస్తుంది.

Read Also : ChatGPT Account : మీ చాట్‌జీపీటీ అకౌంట్ డిలీట్ చేయాలా? ఏయే డివైజ్‌ల్లో ఎలాగంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదిగో..!

ఫాస్ట్ పర్ఫార్మెన్స్ :
ఈ వివో ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఫన్‌టచ్OS ఆధారంగా రూపొందింది.

కెమెరా, వీడియో క్వాలిటీ :
ఈ ఫోటోలు వీడియోల కోసం OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా అందిస్తుంది. ఇందులో 8MP సెకండరీ కెమెరా, థర్డ్ 50MP కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

బ్యాటరీ బ్యాకప్ :
పవర్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్ భారీ 5,500mAh బ్యాటరీతో వస్తుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. IP64 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, Wi-Fi, బ్లూటూత్ GPS వంటి ఫీచర్లు ఉన్నాయి.