ChatGPT Account : మీ చాట్‌జీపీటీ అకౌంట్ డిలీట్ చేయాలా? ఏయే డివైజ్‌ల్లో ఎలాగంటే? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదిగో..!
ChatGPT Account : మీకు ఏఐ చాట్ జీపీటీ అకౌంట్ ఉందా? ఈ ఏఐ అకౌంట్ డిలీట్ చేద్దామని అనుకుంటున్నారా? మీరు ఈ సింపుల్ స్టెప్ ఫాలో అయితే చాలు..
ChatGPT Account (Image Credit To Original Source)
- జీమెయిల్ ద్వారా చాట్‌జీపీటీ అకౌంట్ క్రియేట్ చేశారా?
- కంప్యూటర్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్లలో ఈజీ డిలీట్ ప్రాసెస్
- ఒకసారి డిలీట్ చేస్తే అకౌంట్ పర్మినెంట్ పోయినట్టే
- డిలీట్ ప్రాసెస్ పూర్తి అయ్యేందుకు 30 రోజుల సమయం
ChatGPT Account : ఇప్పుడంతా ఏఐదే ట్రెండ్.. ప్రతిదానికి ఏఐ తెగ వాడేస్తున్నారు. గూగుల్ సెర్చ్ చేసినా ఏ డౌట్ వచ్చినా టక్కున ఏఐని అడిగేస్తున్నారు. ఎక్కువ మంది వాడే ఏఐ టూల్ ఏంటంటే అందరూ చాట్‌జీపీటీ అనే చెబుతారు. అంతగా పాపులర్ అయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్‌బాట్స్ ఇప్పుడు నిత్యావసరంగా మారాయి. ఏ పనైనా ఇప్పుడు చిటికెలో పూర్తి అయిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ ఉపయోగిస్తున్నారు.
వాస్తవానికి, అదే పనిగా ఏఐ వాడినా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుందని తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ప్రతిదానికీ చాట్‌జీపీటీపై ఆధారపడొద్దని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ వాడటం ద్వారా సొంతంగా ఆలోచించలేరు. క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది.
మీరు కూడా చాట్‌జీపీటీ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే.. ఏఐకి దూరంగా ఉండాలని మీరు భావిస్తుంటే.. మీ చాట్‌జీపీటీ అకౌంట్ ఎలా డిలీట్ చేయాలో ఈ సింపుల్ గైడ్ ద్వారా తెలుసుకుందాం..
పీసీ, ల్యాప్‌టాప్ నుంచి ఎలాగంటే? :
- మీ ల్యాప్‌టాప్‌లో ఏదైనా బ్రౌజర్‌లో చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి.
- ఇమెయిల్ అడ్రస్ ద్వారా మీ అకౌంట్లలో లాగిన్ అవ్వండి.
- అకౌంటులో లెఫ్ట్ కార్నర్‌లో మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
- ఆపై ‘Settings’పై క్లిక్ చేయండి.
- ‘Settings’పై క్లిక్ చేశాక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ‘Account’ఆప్షన్ కనిపిస్తుంది.
- ‘Account’పై క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేయండి.
- ‘Delete Account’ కోసం ‘Delete’ ఆప్షన్ క్లిక్ చేయండి.

ChatGPT Account (Image Credit To Original Source)
స్మార్ట్‌ఫోన్ల నుంచి ఎలా? :
- మీ Android లేదా iOS డివైజ్‌లో ChatGPT ఓపెన్ చేయండి.
- మీ వ్యాలీడ్ ఇమెయిల్ ఐడీతో లాగిన్ అవ్వండి.
- టాప్ లెఫ్ట్ కార్నర్‌లో కనిపించే త్రి డాట్ లైన్స్‌పై క్లిక్ చేయండి.
- కొత్త చాట్, ఫొటోలు, చాట్ జీపీటీతో గత చాట్ వంటి వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీ ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి. All Settings ఆప్షన్ కనిపిస్తుంది.
- మీరు ‘Data Controls’ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయండి.
- డేటా కంట్రోల్ కింద ‘Delete OpenAI Account’ఆప్షన్ ఎంచుకోవచ్చు.
- మీ చాట్‌జీపీటీ అకౌంట్ పర్మినెంట్‌గా డిలీట్ అవుతుంది.
మీ చాట్‌జీపీటీ అకౌంట్ పర్మినెంట్ డిలీట్ అయ్యాక మళ్లీ రీస్టోర్ చేయడం కుదరదు. ఒకవేళ మీకు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ ఉంటే విడిగా సబ్‌స్క్రిప్షన్ క్యాన్సిల్ చేయాలి. కొత్త అకౌంట్ క్రియేట్ చేసేందుకు మీరు అదే ఇమెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్‌ను వాడలేరు.
అన్ని ఓపెన్ఏఐ యాప్‌లలోని మీ మొత్తం డేటా డిలీట్ అవుతుంది. ‘Delete’పై క్లిక్ చేశాక మీ డేటా పూర్తిగా డిలీట్ అయ్యేందుకు దాదాపు 30 రోజులు పడుతుంది.
