సెప్టెంబర్ 29 నుంచి సేల్ : ఇండియాలో Vivo U10 లాంచ్.. ధర ఎంతంటే?

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది.

  • Published By: sreehari ,Published On : September 24, 2019 / 01:04 PM IST
సెప్టెంబర్ 29 నుంచి సేల్ : ఇండియాలో Vivo U10 లాంచ్.. ధర ఎంతంటే?

Updated On : September 24, 2019 / 1:04 PM IST

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది.

చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ వివో కంపెనీ ఇండియన్ మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. అదే.. Vivo U10 స్మార్ట్ ఫోన్. ఇది మొత్తం మూడు స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర మార్కెట్లో రూ.8వేల 990గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్లో ప్రత్యేక ఫీచర్లలో 5,000mAh బ్యాటరీ సామర్థ్యం ఉంది. స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ ఎట్రాక్టీవ్ గా ఉంది.

వివో U10 బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.8వేల 990గా ఉండగా.. స్టోరేజీ 3GB/32GB ఉంది. మరో రెండు వేరియంట్లలో 3GB/64GB, 4GB/64GB స్మార్ట్ ఫోన్ లభించనుంది. వీటి ప్రారంభ ధర మార్కెట్లో రూ.9వేల 990, రూ.10వేల 990గా నిర్ణయించింది. అమెజాన్ స్పెషల్ డివైజ్ పేరుతో సెప్టెంబర్ 29 నుంచి వివో U10 మోడల్ స్మార్ట్ ఫోన్ అమెజాన్, వివో ఈకామర్స్ వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ వివో కొత్త మోడల్ పై రూ.6వేలు (రూ.299 డేటా ప్లాన్) వరకు జియో బెనిఫెట్స్ కూడా పొందవచ్చు. బజాజ్ ఫైనాన్షియల్ సర్వీసు క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. వివో.కామ్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసినవారికి రూ.750 ఫ్లాట్ ఆఫర్ పొందవచ్చు. వివో కంపెనీ.. స్మార్ట్ ఫోన్ గేమింగ్ మోడ్ పై దృష్టి పెట్టింది. కంపెనీ అందించే వాయిస్ ఛేంజర్, గేమ్ ఐ ప్రొడక్షన్, డోంట్ డిస్టర్బ్, గేమ్ కౌంట్ డౌన్ కు సంబంధించి పంక్షనాలిటీ అఫర్ చేస్తోంది. 

స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 6.35 అంగుళాల LCD డిస్ ప్లే HD+ రెజుల్యూషన్
* V-Shaped నాచ్, 8MP సెల్ఫీ కెమెరా
* స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
* 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజీ
* రియర్ మౌంటెడ్ ఫింగర్ ఫ్రింట్ స్కానర్
* బయోమెట్రిక్ అథంటెకేషన్ 
* ట్రిపుల్ కెమెరా సిటప్ (13MP) ప్రైమరీ సెన్సార్
* 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP బోకేశ్ కెమెరా (ఫోర్టరైట్ షాట్స్)
* 5,000mAh బ్యాటరీ సామర్థ్యం
* PUBG వంటి వీడియో గేమ్ ఆడినప్పటికీ 7 గంటలుగా సెట్ చేసుకుంది.
* మైక్రో SB పోర్టు ద్వారా ఫోన్ కనెక్ట్ చేసేందుకు 18W ఫాస్ట్ ఛార్జర్ రిలీజ్ అయింది.