Vivo V40 Pro Series : వివో నుంచి సరికొత్త వి40 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo V40 Pro Series : వివో వి40 ప్రో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో రన్ అయ్యే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు ఆకట్టుకునే కెమెరా సెటప్‌లు, కనెక్టివిటీ ఆప్షన్లు, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో భారీ బ్యాటరీలను అందిస్తాయి.

Vivo V40 Pro Series : వివో నుంచి సరికొత్త వి40 ప్రో సిరీస్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

Vivo V40 and V40 Pro launched in India ( Image Source : Google )

Vivo V40 Pro Series : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వివో నుంచి రెండు సరికొత్త ఫోన్లు వచ్చేశాయి. వివో వి40, వివో వి40 ప్రో ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. వివో వి40 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్3 చిప్‌సెట్ ద్వారా ఆధారతమైంది. కలర్ ఆప్షన్లతో 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

Read Also : iPhone 16 Pro Series : భారీ బ్యాటరీతో ఐఫోన్ 16 ప్రో సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు లీక్.. లాంచ్ ఎప్పుడు ఉండొచ్చుంటే?

వివో వి40 ప్రో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్‌తో రన్ అయ్యే మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. రెండు ఫోన్‌లు ఆకట్టుకునే కెమెరా సెటప్‌లు, వేగవంతమైన కనెక్టివిటీ ఆప్షన్లు, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద బ్యాటరీలను అందిస్తాయి. సొగసైన డిజైన్‌లు, అడ్వాన్స్‌డ్ ఫీచర్‌లతో వివో వి40 సిరీస్ అసాధారణమైన యూజర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

వివో వి40, వివో వి40 ప్రో ధర ఎంతంటే? :
వివో వి40ప్రో 8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 49,999 ప్రారంభ ధరతో వస్తుంది. వివో వి40 వరుసగా 128జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడళ్లకు రూ. 34,999, రూ. 36,999కి వస్తుంది. ఆగస్టు 19న భారత మార్కెట్లో స్టాండర్డ్ మోడల్ విక్రయానికి వస్తుంది. ప్రో మోడల్ ఆగస్టు 13న అందుబాటులో ఉంటుంది.

వివో వి40 ప్రో ఫీచర్లు :
వివో వి40ప్రో ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో వస్తుంది. ఒక బిలియన్ రంగులను ప్రదర్శిస్తుంది. హెచ్‌డీఆర్10+కి సపోర్టు ఇస్తుంది. మృదువైన విజువల్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. స్క్రీన్ గరిష్ట ప్రకాశం 4500 నిట్‌లు, 1260 x 2800 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో డిస్‌ప్లే పవర్‌ఫుల్ ఫొటోలను అందిస్తుంది. వివో ఫోన్ 164.2×74.9 x 7.6 మిమీ కొలతలు, 192 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై) ప్లస్ ఇసిమ్ కలిగి ఉంది. వివో వి40 ప్రో కూడా నీటి నిరోధకతకు ఐపీ68-రేట్ కలిగి ఉంది. 30 నిమిషాల పాటు 1.5 మీటర్ల వరకు నీటిలో పడినా చెక్కు చెదరదు.

ఫన్‌టచ్ 14తో ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతోంది. వివో వి40ప్రో మీడియాటెక్ డైమన్షిటీ 9200+ చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. ఆక్టా-కోర్ సీపీయూ, ఇమ్మోర్టాలిస్-జీ715 ఎంసీ11 జీపీయూని కలిగి ఉంది. అన్ని యాప్‌లు, గేమ్‌లతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. వివో వి40ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50ఎంపీ వైడ్ లెన్స్, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 50ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. వీడియోల విషయానికి వస్తే.. 30ఎఫ్‌పీఎస్ వద్ద 4కె రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఫ్రంట్ కెమెరా డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50ఎంపీ వైడ్ లెన్స్, 30ఎఫ్‌పీఎస్ వద్ద 4కె వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వివో వి40 ప్రో వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ (మార్కెట్ డిపెండెంట్), ఓటీజీ సపోర్టుతో యూఎస్‌బీ టైప్-సి 2.0కి సపోర్టు ఇస్తుంది. జీపీఎస్, జీఎల్ఓఎన్ఎఎస్ఎస్, బీడీఎస్, జీఏఎల్ఐఎల్ఈఓ, క్యూజెడ్ఎస్ఎస్, ఎన్ఏవీఐసీతో సహా సమగ్ర స్థాన వ్యవస్థలను అందిస్తుంది. వివో ఫోన్‌లో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, గైరో, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్ ఉన్నాయి. 5500mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. 80W వైర్డ్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.

వివో వి40 స్పెసిఫికేషన్‌లు :
వివో వి40 ఫోన్ 1260 x 2800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పెద్ద 6.78-అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. పిక్సెల్ సాంద్రత 453పీపీఐ, హెచ్‌డీఆర్10+కి సపోర్టుతో డిస్‌ప్లే క్వాలిటీతో ఆకట్టుకుంటుంది. స్క్రీన్ 4500 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కూడా కలిగి ఉంది. అదనంగా, డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 480Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. పంచ్-హోల్ డిజైన్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

వివో వి40 ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. 7.6ఎమ్ఎమ్ మందంతో స్లిమ్ ప్రొఫైల్‌ను కలిగి ఉంది. 190 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, భద్రతను అందిస్తుంది. హుడ్ కింద, వివో వి40 క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్3 చిప్‌సెట్‌తో 2.63GHz క్లాక్ చేసిన ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 8జీబీ ర్యామ్, అదనంగా 8జీబీ వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. కానీ, కార్డ్ ద్వారా మెమరీ విస్తరణకు సపోర్టు ఇవ్వదు.

ఫోటోగ్రఫీ విషయానికి వస్తే..
వివో వి40 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో రెండు 50ఎంపీ కెమెరాలను కలిగి ఉంటుంది. స్థిరమైన, స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. బ్యాక్ కెమెరాలు 30ఎఫ్‌పీఎస్ వద్ద 4కె వీడియోలను రికార్డ్ చేయగలవు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ కెమెరా ఉంది.

వివో వి40 వేగవంతమైన కనెక్టివిటీకి 4జీ, 5జీ వోఓఎల్‌టీఈ సపోర్టు ఇస్తుంది. ఇందులో బ్లూటూత్ v5.4, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ-సి వి2.0, అదనపు యాక్టివిటీకి ఐఆర్ బ్లాస్టర్ ఉన్నాయి. వివో ఫోన్ పెద్ద 5500mAh బ్యాటరీతో ఆధారితమైనది. 80డబ్ల్యూ ఫ్లాష్‌ఛార్జ్‌కు సపోర్టు ఇస్తుంది.

Read Also : Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ 15పై అదిరే డీల్.. ధర ఎంత తగ్గిందంటే? మరెన్నో బ్యాంకు ఆఫర్లు..!