Vivo V50e Price
Vivo V50e : వివో అభిమానులకు పండగే.. వివో V50e ఫోన్ ధర తగ్గింది. సెల్ఫీ కెమెరా ఫోన్ల (Vivo V50e) కోసం చూసేవారికి ఇదే బెస్ట్ టైమ్.. పవర్‌ఫుల్ కెమెరాతో వచ్చిన వివో V50e 5G ఫోన్ కొనేసుకోండి.
మిడ్-రేంజ్ ధరలోనే సొంతం చేసుకోవచ్చు. ఈ వివో ఫోన్ కొనుగోలుపై అనేక ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లతో చాలా తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. ధర, కెమెరాల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V50e ఆఫర్లు, ధర వివరాలివే :
ధర విషయానికి వస్తే.. 8GB+256GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ధర రూ. 35,999గా లిస్టు కాగా, విజయ్ సేల్స్‌పై 14శాతం తగ్గింపు అందిస్తోంది. దాంతో ఈ వివో ఫోన్ ధర రూ. 30,999కు తగ్గుతుంది.
ఆఫర్ల ద్వారా ఈ వివో ఫోన్ ధరను ఇంకా తక్కువకే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో HDFC, HSBC బ్యాంక్ కార్డులపై రూ. 2,500 డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 1503 EMI ఆప్షన్ కూడా పొందొచ్చు.
Vivo V50e ఫీచర్లు :
6.77-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120Hz సపోర్ట్, 1800 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీ ఆప్షన్లలో వస్తుంది.
Read Also : Google I/O 2025 : గూగుల్ వార్షిక I/O ఈవెంట్ ఎప్పుడు? లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి? ఏయే అప్‌డేట్స్ ఉండొచ్చంటే?
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. 50MP ప్రైమరీ కెమెరాతో OIS సపోర్టుతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు 50MP ఫ్రంట్ కెమెరా ఉండగా, 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5600mAh బ్యాటరీ కూడా ఉంది. IP68, IP69 రేటింగ్ కూడా కలిగి ఉంది.