Vivo Y300 5G
Vivo Y300 5G : వివో కొత్త ఫోన్ కావాలా భయ్యా.. అద్భుతమైన డిజైన్, సరసమైన ధరలో కొత్త వివో Y300 5G ఫోన్ అందుబాటులో ఉంది. అతి తక్కువ ధరలో కొత్త ఫోన్ కోసం (Vivo Y300 5G) చూస్తున్నవారికి బెస్ట్ ఆఫర్.. ప్రస్తుతం ఈ వివో ఫోన్ అమెజాన్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారాల్లో భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది.
ఈ ఆఫర్లు లిమిటెడ్ పీరియడ్ మాత్రమే. మిడ్-సెగ్మెంట్ ఫోన్ అసలు మిస్ చేసుకోవద్దు. వివో Y300 5G ఫోన్ ధర, ఫీచర్ల పరంగా తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రాసెసర్ :
వివో Y300 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ద్వారా పవర్ పొందుతుంది. 2.2GHz వేగంతో ఆక్టా-కోర్ చిప్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్, క్యాజువల్ మల్టీ టాస్కింగ్ వంటి టాస్కులకు బెటర్. 8GB ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ కలిగి ఉంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్, 2TB వరకు మెమరీ కార్డ్‌లకు సపోర్టు వస్తుంది. హైబ్రిడ్ స్లాట్ ఆప్షన్ కూడా ఉంది.
డిస్‌ప్లే, బ్యాటరీ :
ఈ వివో ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 395ppi, 1800 నిట్స్ లోకల్ టాప్ బ్రైట్‌నెస్ చేరుకుంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రోలింగ్, వీడియో ప్లేబ్యాక్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. హై-ఎండ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంది. బ్యాటరీ పరంగా 5000mAh బ్యాటరీ రోజంతా వస్తుంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా స్పీడ్ ఛార్జ్ అవుతుంది.
వివో Y300 5G కెమెరాలు :
డ్యూయల్ రియర్ కెమెరాలో 50MP ప్రైమరీ సెన్సార్, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. డే టైమ్ క్లియర్ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది. 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. 30fps వద్ద 1080p రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఫోన్.
ధర ఎంతంటే? :
వివో Y300 5G ఫోన్ రూ. 26,999కు వచ్చింది. లిమిటెడ్ ఆఫర్ కింద రూ. 20,999కు అమ్ముడవుతోంది. 22శాతం తగ్గింపు పొందవచ్చు. ప్రస్తుత 5G మిడ్-రేంజ్ కేటగిరీలో మంచి వాల్యూ అందిస్తుంది. ఈఎంఐ ప్లాన్‌లు కేవలం రూ. 1,018 నుంచి ప్రారంభమవుతాయి. చాలా మంది వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ ఆఫర్లు :
కొనుగోలుదారులు కొన్ని క్రెడిట్ కార్డులపై రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని వాడితే.. రూ. 629 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.