BSNL Cheapest Plan : అతి చౌకైన BSNL రీఛార్జ్ ప్లాన్.. 70 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB హైస్పీడ్ డేటా.. జస్ట్ ఎంతంటే?
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఈ చీపెస్ట్ ప్లాన్‌తో రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 70 రోజుల వ్యాలిడిటీతో ఎంజాయ్ చేయొచ్చు..

BSNL Cheapest Plan
BSNL Cheapest Plan : బీఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం సరికొత్త చీపెస్ట్ ప్లాన్.. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలో అమాంతం పెంచేయడంతో మొబైల్ వినియోగదారులు (BSNL Cheapest Plan) సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. రూ. 200 కన్నా తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్ ఒకటి ఉంది.
BSNL తమ యూజర్ల కోసం రూ. 197కే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. సెకండరీ సిమ్ కోసం చీపెస్ట్ ప్లాన్ తీసుకోవాలంటే ఇదే బెస్ట్. బీఎస్ఎన్ఎల్ 70 రోజుల వ్యాలిడిటీతో అతి చౌకైన ప్లాన్ ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ రూ. 197 ప్లాన్ సంబంధించి పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ (BSNL) యూజర్లకు రూ. 197 రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ ఇంటర్నెట్ వినియోగం కోసం రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 100 SMS కూడా పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ కంపెనీ ఈ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
వినియోగదారులు ఈ ప్లాన్ బెనిఫిట్స్ 15 రోజులు మాత్రమే అందిస్తుంది. రోజువారీ డేటా లిమిట్ తర్వాత వినియోగదారులు 40kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటాను యాక్సెస్ చేయవచ్చు. ఈ బెనిఫిట్స్ ఫస్ట్ 15 రోజులు మాత్రమే. ఆ తర్వాత యూజర్లు తమ కాలింగ్, డేటా, SMS కోసం విడిగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ అనేక బీఎస్ఎన్ఎల్ టెలికాం సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.
బీఎస్ఎన్ఎల్ రూ. 198 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ. 198 డేటా వోచర్ ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్‌లోని హై-స్పీడ్ డేటా అయిపోయాక ఇంటర్నెట్ స్పీడ్ 40Kbpsకి తగ్గుతుంది. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 40 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో కాలింగ్, SMS బెనిఫిట్స్ అందుబాటులో లేవు.