Apple iOS 26 Beta : గుడ్ న్యూస్.. ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు అదుర్స్.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Apple iOS 26 Beta : ఆపిల్ iOS 26 బీటా వెర్షన్ వచ్చేసింది.. మీ ఐఫోన్ మోడల్స్‌లో ఈ కొత్త అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి..

Apple iOS 26 Beta : గుడ్ న్యూస్.. ఆపిల్ iOS 26 బీటా 2 అప్‌డేట్.. కొత్త ఫీచర్లు అదుర్స్.. ఇలా సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి..!

Apple iOS 26 Beta

Updated On : July 4, 2025 / 4:45 PM IST

Apple iOS 26 Beta : ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆపిల్ iOS 26 సెకండ్ డెవలపర్ బీటాను అధికారికంగా రిలీజ్ చేసింది. WWDC 2025 ఈవెంట్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్‌లో భారీ అప్‌గ్రేడ్స్ అందించింది. ఇందులో యూజర్ ఇంటర్‌ఫేస్ (UI) మార్పులు, యాక్సెసిబిలిటీ అప్‌గ్రేడ్స్, సఫారి, వ్యాలెట్, యాప్ స్టోర్ వంటి పాపులర్ యాప్‌లకు ఫంక్షనల్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.

iOS26 పబ్లిక్ బీటా రిలీజ్ తేదీ మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. మీరు iOS 26 డెవలపర్ బీటాకు అప్‌డేట్ చేస్తుంటే.. మీ మొత్తం డేటాను తప్పనిసరిగా బ్యాకప్ చేసుకోండి. ఫీచర్లు, అప్‌డేట్స్ మీ ఐఫోన్‌లో ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

iOS 26 బీటా 2 కొత్త ఫీచర్లు :
iOS 26 బీటా 2లోని ఫీచర్లలో లిక్విడ్ గ్లాస్ డిజైన్‌, ఆకర్షణీయమైన బ్యాక్‌గ్రౌండ్ రీడిజైన్ కంట్రోలింగ్ సెంటర్ ఉంది. యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్‌లో “Reduce Transparency” టోగుల్ ఉంటుంది.
రీడబిలిటీ కోసం ఇంటర్‌ఫేస్ ఒపాసిటీని తగ్గిస్తుంది. కొత్త ట్యాబ్ బటన్‌ ఆపిల్ సఫారీ బాటమ్ లెఫ్ట్ కార్నర్ కలిగి ఉంది. గత వెర్షన్‌లకు అనుగుణంగా ఉంటుంది. కాంపాక్ట్ ట్యాబ్ బార్ ఇప్పుడు ఫార్వర్డ్, బ్యాక్‌వర్డ్ నావిగేషన్ రెండింటినీ డిస్‌ప్లే చేస్తుంది.

Read Also : Oppo Find X8 Pro Price : ఇది కదా ఆఫర్.. అమెజాన్‌లో ఒప్పో ఫైండ్ F8 ప్రో ధర తగ్గిందోచ్.. ఇలా కొనేసుకోండి..!

యాప్ స్టోర్ స్పెషల్ “Accessibility” సెక్షన్ ద్వారా డెవలపర్లు ఇప్పుడు యాప్ ప్రొడక్టు పేజీలలో ఫీచర్లను ట్యాప్ చేయొచ్చు. వ్యాలెట్ యాప్ ద్వారా కొత్త ఆర్డర్ ట్రాకింగ్ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. Siri ఇమెయిల్‌లను స్కాన్ చేయడం, ఆపిల్ పే (Apple Pay) కాని వాటి నుంచి రసీదులను కూడా స్కాన్ చేస్తుంది. తద్వారా సింగిల్ ఆర్డర్ లిస్టును క్రియేట్ చేయొచ్చు.

లేటెస్ట్ అప్‌డేట్ రిఫ్లెక్షన్ కేటగిరీ కింద ‘Alt 1’ అనే కొత్త రింగ్‌టోన్ ఆప్షన్, ఆపిల్ మ్యూజిక్ యూజర్లు లైవ్ రేడియో విడ్జెట్ కోసం లో-పవర్ మోడ్ లైవ్ క్యాప్షన్‌ ‘Save Call Transcripts”అందిస్తుంది. ఇందులో పాల్గొనేవారికి ట్రాన్స్‌క్రిప్షన్ వార్నింగ్ టోన్ ఉంటుంది. స్క్రీన్ దిగువన లాక్ స్క్రీన్ విడ్జెట్‌లతో పాటు పాస్‌కీ సైన్-ఇన్ ఇంటర్‌ఫేస్ రీడిజైన్ కూడా ఉంటుంది.

iOS 26 బీటా 2 ఎలా పొందాలి? :
ప్రస్తుతం రిజిస్టర్ డెవలపర్లు iOS 26 బీటా 2ను యాక్సెస్ చేయవచ్చు. ఆపిల్ డెవలపర్ ప్రోగ్రామ్‌లో మెంబర్లు అయితే.. Settings > General > Sotware Update > Beta Updates ఆప్షన్‌కు వెళ్లి iOS 26 డెవలపర్ బీటా ఆప్షన్ ఎంచుకోండి. ఐఫోన్ 17 సిరీస్‌తో పాటు సెప్టెంబర్ మధ్యలో రిలీజ్ కానుంది. ఈ జూలైలో పబ్లిక్ బీటా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.