Vivo Y78t Launch : భారీ బ్యాటరీతో వివో కొత్త ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Vivo Y78t Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? భారీ బ్యాటరీతో వివో నుంచి సరికొత్త మోడల్ (Vivo Y78t Launch Offers) లాంచ్ అయింది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

Vivo Y78t Launch : భారీ బ్యాటరీతో వివో కొత్త ఫోన్ వచ్చేసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

Vivo Y78t With Snapdragon 6 Gen 1 SoC, 6,000mAh Battery Launched

Updated On : October 23, 2023 / 9:06 PM IST

Vivo Y78t Launch : వివో అభిమానులకు పండుగే.. చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో (Vivo) నుంచి సరికొత్త Y-సిరీస్ ఫోన్ వచ్చేసింది. చైనాలో కొత్త Vivo స్మార్ట్‌ఫోన్ ఫుల్-HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.64-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. (Vivo Y78t) మోడల్ 12GB వరకు RAMతో పాటు స్నాప్‌డ్రాగన్ 6 Gen 1 SoCపై రన్ అవుతుంది.

వివో Y78t 50MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆగస్టులో చైనాలో ఆవిష్కరించిన (Vivo Y77t) మోడల్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా అందుబాటులోకి వచ్చింది.

Read Also : Online Electricity Bill Scam : మీ కరెంట్ బిల్లు ఇంకా కట్టలేదా? ఈ లింక్ క్లిక్ చేసి వెంటనే చెల్లించండి.. ఇలా మెసేజ్ వచ్చిందా? తస్మాత్ జాగ్రత్త!

భారత్‌లో వివో Y78t ధర, లభ్యత :

వివో Y78t ఫోన్ 12GB RAM + 256GB స్టోరేజ్‌తో టాప్-ఎండ్ వేరియంట్ ధర CNY 1,499 (దాదాపు రూ. 17వేలు)గా ఉంది. ప్రస్తుతం 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ ధర వివరాలు తెలియవు. మూన్ షాడో బ్లాక్, స్నోవీ వైట్, డిస్టెన్స్ మౌంటైన్స్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం చైనాలో Vivo అధికారిక ఇ-స్టోర్ ద్వారా అమ్మకానికి ఉంది.

వివో Y78t స్పెసిఫికేషన్లు :
వివో Y78t ఫోన్ డ్యూయల్-సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OriginOS 3తో వస్తుంది. 6.64-అంగుళాల ఫుల్-HD+ (2,388 x 1,080 పిక్సెల్‌లు) LCD IPS డిస్‌ప్లేను 120Hz, 394ppi పిక్సెల్ డెన్సిటీ, 91.06 స్క్రీన్-టు-బాడీ రేషియో రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా సెంట్రల్ నాచ్‌ని కలిగి ఉంది. హుడ్ కింద, హ్యాండ్‌సెట్ 12GB వరకు LPDDR4X RAMతో ఆక్టా-కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 6 Gen SoC ద్వారా పవర్ అందిస్తుంది.

Vivo Y78t With Snapdragon 6 Gen 1 SoC, 6,000mAh Battery Launched

Vivo Y78t 6,000mAh Battery Launched

ఈ హ్యాండ్‌సెట్ ఫొటోలు, వీడియోలకు వివో Y78t డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో f/1.8 లెన్స్‌తో 50MP ప్రైమరీ సెన్సార్, f/2.4 లెన్స్‌తో 2MP డెప్త్ షూటర్ ఉన్నాయి. ముందు భాగంలో f/2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. ఇంకా, హ్యాండ్‌సెట్ 256GB UFS2.2 స్టోరేజ్‌తో వస్తుంది.

వివో Y78t 5Gలోని కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi, బ్లూటూత్ 5.1, GPS, Beidou, Glonass, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్ ఉన్నాయి. అథెంటికేషన్ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

Read Also : Vivo X90 Pro Price Cut : కొంటే ఈ ఫోన్ కొనాల్సిందే.. వివో X90 ప్రో ధర భారీగా తగ్గింపు.. మరెన్నో డిస్కౌంట్లు..!