Vodafone Idea CEO కు మూడేళ్ల వరకు జీతం నిల్

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 08:43 AM IST
Vodafone Idea CEO కు మూడేళ్ల వరకు జీతం నిల్

Updated On : September 9, 2020 / 11:28 AM IST

Vodafone Idea MD & CEO రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుంది. ఆయనకు జీతం చెల్లించకూడదని కంపెనీ ఓ ప్రతిపాదన తీసుకొచ్చింది. టక్కర్ కు సంబంధించిన ప్రయాణం, బస, వినోద, ఇతర ఖర్చులను భరించాలని భావిస్తోంది.




బోర్డు మీటింగ్స్, ఇతర కమిటీల సమావేశాల పాల్గొన్న సమయంలో ఎలాంటి వేతనాలు చెల్లించదు. ఈనెల 30వ తేదీన నిర్వహించే కంపెనీ 25వ వార్షిక సాధారణ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో టక్కర్ నియామకంతో సహా ఇతర ప్రతిపాదనలపై వాటాదారుల ఆమోదం కోరనుంది.
https://10tv.in/pubg-ban-pubg-corporation-to-take-over-pubg-mobile-from-tencent-games-in-india/
ఇప్పటికే వాటాదారులకు నోటీసులను జారీ చేసింది. బాలేష్ శర్మ అకస్మిక రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో రవీందర్ ను ఎండీ, సీఈవోగా మూడేళ్ల కాలానికి కంపెనీ నియమించుకొంది. 2019, ఆగస్టు 19వ తేదీ నుంచి ఆయన నియామకం అమల్లోకి వచ్చింది.




ప్రస్తుతం వోడాఫోన్ ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటోంది. gross income (AGR) బకాయిలు 58 వేల 250 కోట్లు చెల్లించాల్సి ఉంది. కంపెనీ రూ. 7 వేల 854 కోట్లు మాత్రమే చెల్లించిందని తెలుస్తోంది. వినియోగదారుల సంఖ్య కూడా క్రమక్రమంగా తగ్గిపోతోంది. వోడాఫోన్, ఐడియా విలీనం సమయంలో 43 కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్నారు. ఇప్పుడు 30.9 కోట్లకు పడిపోయింది.