Voter ID Card
Voter ID Card : ఓటరు గుర్తింపు కార్డు రూల్స్ మారాయి. దీనికి సంబంధించి భారత ఎన్నికల సంఘం కీలక (Voter ID Card) ప్రకటన చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఓటర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
ఇకపై ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. 15 రోజుల్లో ఓటరు గుర్తింపు కార్డులు అందుతాయి.
కొత్త ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టింది. ఓటర్లకు EPIC లేదా ఓటరు గుర్తింపు కార్డును వేగంగా అందించనుంది.
ఈ వ్యవస్థ కింద ఏదైనా కొత్త ఓటరు పేరు ఓటరు జాబితాలో రిజిస్టర్ చేయడం లేదా అప్‌డేట్ తర్వాత కేవలం 15 రోజుల్లోపు EPIC కార్డు పంపిణీ అవుతుంది.
గత 4 నెలల్లో ఎన్నికల కమిషన్ ఓటర్ల ప్రయోజనాల కోసం అనేక చర్యలు చేపట్టింది. ఓటర్లందరికి వేగంగా ఎన్నికలకు సంబంధించి సమాచారం అందుతుంది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, భద్రత కోసం ఆధార్, ఓటరు ఐడీ కార్డును లింక్ చేసిన సంగతి తెలిసిందే.
ఓటర్లకు SMS సేవలు :
ఈ కొత్త ట్రాకింగ్ వ్యవస్థ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి ఓటరు గుర్తింపు కార్డు జారీ చేసిన తేదీ నుంచి పోస్టల్ విభాగం ద్వారా ఓటరుకు అందజేసే వరకు మొత్తం ట్రాక్ చేస్తుంది.
ప్రతి మూవెంట్ మానిటర్ చేస్తారు. ఓటర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS నోటిఫికేషన్ ద్వారా ఓటర్ ఐడీ వివరాలను పొందుతారు.
డేటా భద్రతతో సర్వీసు డెలివరీ :
ఈఎస్ఐ (ESI) కొత్త ‘ECINet’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. స్పెషల్ IT మాడ్యూల్‌ను అందిస్తుంది. కొత్త ఐటీ ప్లాట్‌ఫామ్ ప్రస్తుత వ్యవస్థను మార్చేస్తోంది.
తద్వారా DOP అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్‌ఫేస్ (API) ఈ ప్లాట్‌ఫామ్‌కు లింక్ అవుతుంది. తద్వారా డెలివరీలో ఎలాంటి అంతరాయం ఉండదు. డేటా సేఫ్టీ కూడా కలిగి ఉంటుంది.