PM Kisan 20th Installment
PM Kisan Instalment : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ 20వ విడత విడుదల కానుంది. పీఎం కిసాన్ లబ్ధిదారు రైతులు (PM Kisan Instalment ) ఎదురుచూస్తున్న రూ. 2వేలు పడాలంటే ముందుగా కొన్ని పనులను తప్పక పూర్తి చేసి ఉండాలి. లేదంటే పీఎం కిసాన్ డబ్బులు అకౌంటులో పడవు.
పీఎం కిసాన్ యోజన నిబంధనల ప్రకారం.. మొదటి విడత ఏప్రిల్, జూలై మధ్యలో, రెండో విడత ఆగస్టు నుంచి నవంబర్, మూడో విడత డిసెంబర్ నుంచి మార్చి మధ్య విడుదల కానుంది. పీఎం కిసాన్ 20వ విడత జూన్, జూలై 2025 మధ్య విడుదల అవుతుందని అంచనా.
వచ్చే నెలలో పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీని ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఉంటే.. రైతులు ఈమెయిల్ ఐడి (pmkisan-ict@gov.in), హెల్ప్‌లైన్ నంబర్ 155261 లేదా 1800115526 (టోల్-ఫ్రీ) లేదా 011-2338109 సంప్రదించవచ్చు. పీఎం కిసాన్ 20వ విడత పొందాలంటే ముందుగా ఈ 3 ముఖ్యమైన పనులను పూర్తి చేయాలి.
ఈకేవైసీ ప్రక్రియ :
మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. మీరు గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి ఫేస్ ద్వారా eKYC పూర్తి చేయొచ్చు. ఇందుకోసం పీఎం కిసాన్ సమన్ నిధి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా ఈజీగా ఉంటుంది.
ల్యాండ్ వెరిఫికేషన్ :
మీ సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి అవసరమైన దరఖాస్తు ఫారమ్‌ను పొందండి. సూచనల ప్రకారం.. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.
ఇందులో పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్, వ్యవసాయ సంబంధిత డాక్యుమెంట్లు ఉండవచ్చు. దరఖాస్తు, డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు. మీ దరఖాస్తు ఆమోదిస్తే.. భూమి వెరిఫికేషన్ పూర్తి అయినట్టే..
బ్యాంకు సీడింగ్ :
రైతు బ్యాంకు ఖాతాలో NPCI పొందాలి. ఎన్‌పీసీఐ లింక్ చేసేందుకు మీ బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డుతో సమీప బ్యాంకును సంప్రదించవచ్చు. తద్వారా మీ పీఎం కిసాన్ రూ. 2వేలు నేరుగా బ్యాంకు అకౌంటులో జమ అవుతాయి.
జాబితాలో మీ పేరును ఎలా చెక్ చేయాలి? :
మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత గ్రామానికి చెందిన పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తారు. ఈ జాబితాలో మీ పేరు ఉంటే.. రూ. 2వేలు కూడా మీ బ్యాంకు అకౌంట్‌లో జమ అవుతాయి.