Summer AC Bill : వేసవిలో ఏసీ బిల్లు ఎక్కువగా వస్తుందా? మీ ఏసీలో ఈ టెంపరేచర్ సెట్టింగ్‌ ఇలా మార్చండి.. దెబ్బకు బిల్లు తగ్గడం ఖాయం!

Summer AC Bill : ఏసీలు వేడి నుంచి రిలీఫ్ అందిస్తాయి. కానీ, అదేపనిగా ఏసీ ఆన్ చేయడం వల్ల భారీగా విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఏసీని సరిగా వాడక పోవడం వల్ల కూడా విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తుందని మీకు తెలుసా?

Summer AC Bill

Summer AC Bill : వేసవి వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఎయిర్ కండిషనర్ల కొని తెచ్చేసుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో వేడిని తట్టుకునేందుకు ఏసీలు వాడకం తప్పనిసరిగా మారింది. వేసవి వచ్చిందంటే చాలు.. పాత ఏసీల నుంచి కొత్త ఏసీలను ఆన్ చేసేస్తుంటారు. కాసేపు కూడా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి మరి. ఏసీ కూలింగ్‌‌తో బాగానే ఉంది కానీ, ఏసీల వాడకంతో విద్యుత్ బిల్లుల భారాన్ని భరించక తప్పదు.

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఏసీని వాడుతుంటారు. కానీ, ఏసీని ఎలా వాడాలో తెలియక విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని ఆందోళన చెందుతుంటారు. ఏసీని రోజంతా ఆన్ చేసి ఉంచినా కూడా విద్యుత్ బిల్లులు తక్కువ రావాలంటే ఏం చేయాలో తెలుసా? అదృష్టవశాత్తూ.. మీరు రోజంతా మీ ఏసీ రన్ చేసినా కూడా మీ విద్యుత్ బిల్లు చాలా తక్కువగా వస్తుంది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే?

ఏసీ వాడటం వల్ల మీ విద్యుత్ బిల్లు గణనీయంగా పెరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏసీని సరిగ్గా వాడకపోతే.. కూడా అంతే స్థాయిలో విద్యుత్ బిల్లు వస్తాయని తెలుసుకోవాలి. ముఖ్యంగా వేసవి కాలంలో మీ స్ప్లిట్ లేదా విండో ఏసీని సరిగ్గా వాడటం ద్వారా మీరు విద్యుత్ ఖర్చులను భారీగా తగ్గించుకోవచ్చు. విద్యుత్ బిల్లును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. మీ ఏసీ టెంపరేచర్ ఎలా సెట్ చేయాలో తప్పక తెలుసుకోవాలి.

ఒక సెట్టింగ్‌తో విద్యుత్ ఖర్చులు ఆదా :
మీకు విద్యుత్ బిల్లు ఎక్కువగా రావడానికి దాదాపు మీరు ఏసీలో టెంపరేచర్ సెట్టింగ్ చేయడంపైనే ఆధారపడి ఉంటుంది. ఏసీని తక్కువ టెంపరేచర్ మార్చడం వల్ల డబ్బు ఆదా అవుతుందనేది ఒక సాధారణ అపోహ. కానీ, అది నిజం కాదు. మీ ఏసీని ఎంత చల్లగా సెట్ చేసుకుంటే.. మీ విద్యుత్ బిల్లు అంత ఎక్కువగా వస్తాయని గమనించాలి.

బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) ప్రకారం.. మీ ఏసీని 24 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేసుకోవాలి. తద్వారా మీ విద్యుత్ బిల్లు భారీగా తగ్గుతుంది. ఈ టెంపరేచర్ అనేక BEE-రేటెడ్ ఎయిర్ కండిషనర్లకు డిఫాల్ట్ సెట్టింగ్‌గా మారింది. విద్యుత్ ఖర్చులనును తగ్గించడమే కాకుండా, మీ ఆరోగ్యానికి సౌకర్యవంతమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది.

ఏసీ టెంపరేచర్ తగ్గిస్తే ఎక్కువ బిల్లు :
మీరు మీ ఏసీలో ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు.. మీ విద్యుత్ బిల్లు గణనీయంగా పెరుగుతుంది. వాస్తవానికి, మీరు టెంపరేచర్ తగ్గించే ప్రతి డిగ్రీకి, మీ బిల్లు దాదాపు 10శాతం నుంచి 12 శాతం పెరుగుతుంది. అందుకే మీ ఏసీని ఎప్పుడూ 24 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేయడం ఎంతైనా మంచిది.

అధిక విద్యుత్ బిల్లుకు కారణాలివే? :
మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా రావడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? మీరు సెట్ చేసే ఏసీ టెంపరేచర్ సెట్టింగ్. టెంపరేచర్ సెట్టింగ్స్ సరిగా సెట్ చేయకపోతే కరెంట్ బిల్లు భారీగా వస్తుందని గుర్తుంచుకోండి. తక్కువ స్టార్ రేటింగ్‌లు కలిగిన ఏసీ యూనిట్లు కూడా విద్యుత్ బిల్లులు పెరగడానికి కారణం కావొచ్చు.

Read Also : Hyundai Car Prices : కొత్త కారు కొంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు.. ఇప్పుడే కొనడం బెటర్!

స్టార్ రేటింగ్ యూనిట్ ఎంత శక్తిని వినియోగిస్తుందో సూచిస్తుంది. హై రేటింగ్ ఉన్న ఏసీలు సాధారణంగా తక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి. ఫలితంగా తక్కువ విద్యుత్ బిల్లులు వస్తాయి. సామాన్యుల పరంగా, 3-స్టార్ మోడల్‌తో పోలిస్తే.. 5-స్టార్ ఏసీ యూనిట్ ఏసీల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.