Hyundai Car Prices : కొత్త కారు కొంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు.. ఇప్పుడే కొనడం బెటర్!

Hyundai Car Prices : కార్ల ధరల పెంపు సీజన్ మళ్లీ వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఏప్రిల్ 1 నుంచి కార్ల ధరలను భారీగా పెంచనుంది. మూడు శాతం వరకు ధరలను పెంపును పెంచనున్నట్టు ప్రకటించింది.

Hyundai Car Prices : కొత్త కారు కొంటున్నారా? ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు.. ఇప్పుడే కొనడం బెటర్!

Hyundai Car Prices

Updated On : March 20, 2025 / 5:23 PM IST

Hyundai Car Prices : కొత్త కారు కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి హ్యుందాయ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ముడిసరుకు, నిర్వహణ ఖర్చులు పెరగడంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా 2025 ఏప్రిల్ నుంచి కార్ల ధరలను 3 శాతం వరకు పెంచనున్నట్టు ప్రకటించింది.

Read Also : Oppo F29 Series Launch : పవర్‌ఫుల్ బ్యాటరీతో కొత్త ఒప్పో వాటర్‌ప్రూఫ్ 5G ఫోన్‌ వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు అదుర్స్. ధర ఎంతంటే?

అంతేకాదు.. మోడల్‌ను బట్టి కార్ల ధరల పెంపు ఉంటుందని కంపెనీ తెలిపింది. గత అక్టోబర్‌లో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) తర్వాత హ్యుందాయ్ ధరల పెంపు ఇది రెండవసారి. గత డిసెంబర్‌లో హ్యుందాయ్ కార్ల మోడళ్లన్నింటిలోనూ రూ.25వేల వరకు ధరలను పెంచింది.

“హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్‌లో పెరుగుతున్న ఖర్చులను సాధ్యమైనంతవరకు తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. తద్వారా కస్టమర్లపై కనీస ప్రభావం పడనుంది. కొత్త కార్ల ధరల పెరుగుదల ఏప్రిల్ 2025 నుంచి అమలులోకి వస్తుంది.

భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం లేకుండా ఉండేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తున్నాం” అని హెచ్ఎంఐఎల్ హోల్-టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. గతంలో, మారుతి సుజుకి ఇండియా, కియా ఇండియా, టాటా మోటార్స్ కూడా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.

హ్యుందాయ్ సేల్స్ :
గత ఫిబ్రవరిలో మొత్తం వాహన డిస్పాచ్‌లు గత ఏడాది పోలిస్తే 3 శాతం తగ్గి 58,727 యూనిట్లకు చేరుకున్నాయని హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో కంపెనీ 60,501 యూనిట్లను విక్రయించింది. గత నెలలో దేశీయ మార్కెట్‌లోని డీలర్లకు 47,727 యూనిట్లను పంపినట్లు ఆటోమేకర్ తెలిపింది. ఫిబ్రవరి 2024లో 50,201 యూనిట్లతో పోలిస్తే.. 5 శాతం తగ్గుదలగా చెప్పవచ్చు.

Read Also : Apple iPhone 16 : అద్భుతమైన ఆఫర్.. ఐఫోన్ 16పై కళ్లుచెదిరే డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు కావాలంటే?

ఎగుమతి అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంలో 10,300 యూనిట్ల నుంచి 11వేల యూనిట్లకు చేరుకున్నాయి. “దేశీయ అమ్మకాల విషయంలో భౌగోళిక రాజకీయ సవాళ్లు ఉన్నప్పటికీ 2025 కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదిత పన్ను సంస్కరణలు, మెరుగైన లిక్విడిటీ మార్కెట్‌కు అవసరమైన డిమాండ్ బూస్ట్‌ను అందిస్తాయని ఆశావాదంగా ఉన్నాం” అని సీఈఓ తరుణ్ గార్గ్ అన్నారు. ఎగుమతులను సర్దుబాటు చేయడం ద్వారా కంపెనీకి కీలకమైన ఎగుమతి కేంద్రంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

టాటా మోటార్స్, మారుతి సుజుకి వంటి చాలా కార్ల బ్రాండ్లు వచ్చే నెలలో మూడవసారి ధరల పెంపును ప్రకటించాయి. క్రెటా తయారీదారు రెండోసారి కార్ల ధరలను పెంచనుంది. రాబోయే రోజుల్లో ఇతర OEMలు కూడా కార్ల ధరలను పెంచే అవకాశం ఉంది.