NPS Vatsalya : మీ పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీమ్.. NPS వాత్సల్య పథకం ఏంటి? ఎలా ఓపెన్ చేయాలి? ప్రతి పేరెంట్స్ తప్పక తెలుసుకోవాలి!

NPS Vatsalya Scheme : మీ పిల్లల భవిష్యత్తు కోసం అద్భుతమైన స్కీమ్ అందుబాటులో ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేసుకోవచ్చు. మీ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత విద్య, ఇతర ప్రయోజనాలను పొందవచ్చు.

Want To Secure Your Child's Future

NPS Vatsalya Scheme : మీ పిల్లల భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకున్నారా? పిల్లల చదువు కోసం లేదా వారి పెళ్లి కోసం డబ్బును ముందుగానే ఆదా చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన స్కీమ్ ఒకటి ఉంది. అదే.. ఎన్‌పీఎస్ వాత్సల్య పథకం.. (NPS Vatsalya Scheme). మీ పిల్లలు చిన్నప్పుడే ఈ స్కీమ్‌‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో అదే డబ్బు వారి చదువులకు, పెళ్లికి ఉపయోగపడుతుంది.

Read Also : Good News : మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సాయం.. ఎవరు అర్హులు? ఎక్కడ అప్లయ్ చేయాలి? ఫుల్ డిటెయిల్స్..!

ఈ సేవింగ్స్ పెన్షన్ స్కీమ్ అనేది పెన్షన్ ఫండ్, నియంత్రణ అథారిటీ ఆఫ్ ఇండియా (PFRDA)పై నియంత్రణలో ఉంటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం సేవింగ్స్ చేసేందుకు సాయపడుతుంది. మీ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ డబ్బులను అతని/ఆమె విద్య, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు.

NPS వాత్సల్య పథకం అంటే ఏమిటి? :
జాతీయ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు నిండే వరకు ఈ పథకంలో డబ్బు జమ చేయవచ్చు. ఈ పథకం కింద, తల్లిదండ్రులు ప్రతి నెలా కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టవచ్చు. అయితే, పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఈ పథకం తల్లిదండ్రులు క్రమశిక్షణతో పొదుపు చేయడంలో సాయపడుతుంది. తద్వారా డబ్బును వారి పిల్లల విద్య కోసం ఉపయోగించవచ్చు.

NPS వాత్సల్య ఖాతాను రెగ్యులేటరీ NPS ఖాతాగా మార్చవచ్చా? :
మీ పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఆ ఖాతాను నియంత్రిత NPS లేదా ఏదైనా NPS కాని పథకంగా మార్చవచ్చు. ఈ ప్రక్రియలో, పిల్లలకు 18 సంవత్సరాలు నిండిన 3 నెలల్లోపు KYC నింపడం అవసరం.

NPS వాత్సల్య విత్ డ్రా, ఎగ్జిట్ రూల్స్ ఇవే :
NPS వాత్సల్య పథకం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పిల్లలకు 18 ఏళ్లు నిండకముందే పాక్షిక ఉపసంహరణలు చేసుకునే వెసులుబాటును అందిస్తుంది. పథకం నుంచి ఉపసంహరణలు, నిష్క్రమణలను నియంత్రించే కీలక నియమాలు ఇలా ఉన్నాయి.

18 ఏళ్లలోపు పాక్షిక విత్‌డ్రాలు చేయాలంటే? :
NPS వాత్సల్య ఖాతాను నిర్వహించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ కింది షరతులకు లోబడి పాక్షికంగా విత్‌డ్రా చేయవచ్చు.

కనీస లాక్-ఇన్ వ్యవధి : అకౌంట్ కనీసం 3 ఏళ్లు యాక్టివ్‌గా ఉన్న తర్వాత ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
విత్‌డ్రా లిమిట్ : తల్లిదండ్రులు లేదా సంరక్షకులు చేసిన మొత్తం విరాళాలలో 25శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు.
విత్‌డ్రా ఫ్రీక్వెన్సీ : పిల్లలకి 18 ఏళ్లు నిండేలోపు గరిష్టంగా 3 విత్‌డ్రాలను అనుమతిస్తారు.
విత్ డ్రాకు అనుమతించేవి : పిల్లల విద్య, తీవ్రమైన అనారోగ్యాల చికిత్స లేదా వైకల్యం 75శాతం మించి ఉంటే, PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ) వివరించిన విధంగా, నిర్దిష్ట ప్రయోజనాల కోసం విత్‌డ్రా చేయవచ్చు.

Read Also : Post Office Scheme : భలే ఉందిగా పోస్టాఫీసు స్కీమ్.. మీరు పెట్టుబడి పెడితే చాలు.. కేవలం వడ్డీతోనే ప్రతి నెలా రూ. 10వేలు సంపాదించుకోవచ్చు..!

మీ పిల్లల కోసం NPS వాత్సల్య అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? : 

  • మీరు ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మీ పిల్లల కోసం NPS వాత్సల్య అకౌంట్ సులభంగా ఓపెన్ చేయొచ్చు.
  • సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను (https://npstrust.org.in/open-nps-vatsalya) విజిట్ చేయండి.
  • మీరు NPS వాత్సల్య కోసం 3 CRA నుంచి ఎంచుకోవచ్చు.
  • అందులో (Protean, KFintech, CAMS) ఉంటాయి.
  • మీరు (CAMS) ట్యాబ్‌పై క్లిక్ చేస్తే.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం కొత్త ట్యాబ్‌కు రీడైరెక్ట్ అవుతారు.
  • NPS వాత్సల్య (మైనర్) కింద పేరు, పుట్టిన తేదీ, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి పాన్ నంబర్, పుట్టిన తేదీ, సంరక్షకుడి ఇమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ వంటి అన్ని వివరాలను ఎంటర్ చేయండి.
  • అన్ని వివరాలను నింపిన తర్వాత రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసేందుకు దిగువన ఉన్న ‘Open NPS Vatsalya Scheme Tab’పై క్లిక్ చేయండి.

ఈ అకౌంట్ మైనర్ పేరుతో ఓపెన్ చేస్తారు. మీ పిల్లాడికి 18 ఏళ్లు నిండే వరకు అతని/ఆమె సంరక్షకుడిచే నిర్వహిస్తారు. అలాగే, మొత్తం ప్రక్రియలో అకౌంట్ ఏకైక లబ్ధిదారుడు పిల్లవాడు అని గమనించాలి.