WhatsApp Custom Lists : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఈ కొత్త కస్టమ్ చాట్ లిస్టు ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే?
WhatsApp Custom Lists : వాట్సాప్ కస్టమ్ చాట్ లిస్ట్ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ చాట్ లిస్టును సులభంగా యాక్సస్ చేయొచ్చు. ఇంతకీ ఈ చాట్ లిస్టు ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp new custom lists feature
WhatsApp Custom Lists : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. తాజాగా వాట్సాప్ మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. అదే.. వాట్సాప్ కస్టమ్ చాట్ లిస్ట్ ఫీచర్.. ఇంతకీ ఈ చాట్ లిస్టు ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు ఈ కొత్త ఫీచర్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. స్నేహితులు, బంధవులతో పాటు ఇతరులతో కూడా సులభంగా కనెక్ట్ అయ్యేందుకు ఈ చాట్ లిస్టు ఫీచర్ ఉపయోగపడుతుంది.
ఈ చాట్ లిస్టు ఫీచర్ సాయంతో వినియోగదారులు తమ చాట్ జాబితాను సులభంగా యాక్సస్ చేయొచ్చు. ఈ ఫీచర్ పేరు “కస్టమ్ లిస్టు”. ఈఫీచర్‌తో, వినియోగదారులు తమ చాట్‌లను తమకు నచ్చిన గ్రూపులో డివైడ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వాట్సాప్ చాట్‌ను సులభంగా గుర్తించవచ్చు. అవసరమైన వారి కాంటాక్టులను లిస్టుగా తయారు చేయొచ్చు. నివేదిక ప్రకారం.. “వాట్సాప్ జాబితాలతో ఇప్పుడు మీ చాట్‌లను మీకు నచ్చిన కస్టమైజడ్ కేటగిరీలతో ఫిల్టర్ చేయవచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మీ పొరుగువారు, ఇతర స్నేహితుల జాబితాలను క్రియేట్ చేయొచ్చు.
ఈ జాబితాలను సెటప్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. చాట్స్ ట్యాబ్ ఎగువన ఫిల్టర్ బార్‌లోని “+” ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా వినియోగదారులు వారి లిస్టులను క్రియేట్ చేయొచ్చు. కొత్త కాంటాక్టులను యాడ్ చేయడం లేదా లిస్టు పేరు మార్చడం, లిస్టు ఎడిట్ చేయడం చేయొచ్చు. అదనంగా, చాట్ లిస్టు ఫీచర్ గ్రూపు, ఒకరితో ఒకరు చాట్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ చాట్ లిస్టులో అన్ని కేటగిరీలకు చెందిన చాట్‌లు ఫిల్టర్ బార్‌లో కనిపిస్తాయి. దాంతో వాట్సాప్ యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.
కస్టమైజడ్ లిస్టులతో వినియోగదారులు వారి కుటుంబ సభ్యులు, ఆఫీసులోని సహోద్యోగులు, పొరుగువారు లేదా మరే ఇతర కేటగిరీల కోసం గ్రూపులను క్రియేట్ చేయొచ్చు. ఇకపై ఏదైనా మొత్తం చాట్ లిస్టును స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకుండా నిర్దిష్ట చాట్ మాత్రమే యాక్సస్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.
చాట్ కస్టమ్ లిస్టును ఎలా క్రియేట్ చేయాలి? :
వాట్సాప్ చాట్ కస్టమ్ లిస్టు అనేది చాలా ఈజీ ప్రాసెస్. వినియోగదారులు చాట్ ట్యాబ్ ఎగువన ఉన్న ఫిల్టర్ బార్‌లోని “+” ఐకాన్ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. యూజర్ కొత్త లిస్టుకు పేరును క్రియేట్ చేయాలి. వినియోగదారులు తమ ఇష్టమైన లిస్టుకు ఏదైనా చాట్‌ని యాడ్ చేయొచ్చు. వినియోగదారులు తమ లిస్టును కూడా ఎడిట్ చేయొచ్చు. ఈ లిస్టును ఎడిట్ చేయడం కూడా చాలా సులభం. కస్టమ్ లిస్టులను చాట్‌లను యాడ్ చేయొచ్చు. కస్టమ్ లిస్టు క్రియేట్ చేసిన తర్వాత ఫిల్టర్ బార్‌లో కనిపిస్తుంది. వివిధ చాట్ గ్రూపుల మధ్య సులభంగా మారవచ్చు.